Pawan Kalyan : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రూ.50 కోట్ల క్లబ్ లో చేరడమే చాలా గొప్ప. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మన తెలుగు సినిమా మార్కెట్ కూడా భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం చాలా కామన్ అయిపోయింది.
ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ లాంటి వారు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. కాగా ఇప్పటికీ వంద కోట్ల క్లబ్ లో చేరని ఏకైక స్టార్ హీరో ఎవరైనా ఉన్నారా అంటూ అది కేవలం పవన్ కల్యాణ్ మాత్రమే. ఆయన ఇప్పుడు టాలీవుడ్ లోనే అగ్ర హీరోగా ఉన్నారు.
ఆయన ప్లాప్ సినిమాలు కూడా ఓ రేంజ్ లో వసూళ్లు సాధిస్తాయి. అలాంటి పవన్ కల్యాణ్ సినిమాలు ఇప్పటికీ రూ.100 కోట్లు వసూలు చేయలేదు. చివరగా ఆయన నటించిన భీమ్లా నాయక్ ఈ మార్కు అందుకుంటుందని అనుకున్నారు. కానీ ఏపీలో టికెట్ రేట్లు తగ్గించడంతో ఈ సినిమా రూ.95 కోట్ల షేర్ వద్దనే ఆగిపోయింది.
ఇప్పటి వరకు పవన్ ఈ మార్కును అందుకోలేదు. కానీ ఆయన తర్వాత నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో ఈ మార్కును అందుకుంటారని అంతా అనుకుంటున్నారు. మరి ఫ్యాన్స్ ఇంత బలంగా కోరుకుంటున్న సందర్భంగా ఆయన వంద కోట్ల క్లబ్ లో చేరుతారా లేదా అనేది చూడాలి.
Also Read : Divi Vadthya : అవకాశాల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి సంచలన వ్యాఖ్యలు..!
Also Read : Samantha : సమంతకు ఇంత మందితో లవ్ ఎఫైర్ వార్తలు వచ్చాయా..?