Pawan Kalyan : పవన్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. రిలీజ్ అయ్యేంత వరకు పెద్దగా అంచనాలు లేవు. కేవలం పవన్ నటిస్తున్నాడనే అంచనాలు తప్ప కంటెంట్ పరంగా హైప్ క్రియేట్ చేయలేకపోయింది ఈ సినిమా.
కానీ థియేటర్లలో రిలీజ్ అయిన రోజు రచ్చ స్టార్ట్ అయింది. చూసిన ప్రతి ఒక్కరూ డబుల్ బ్లాక్ బస్టర్ పక్కా అంటూ చొక్కాలు చింపుకున్నారు. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ లో ఊపు వచ్చింది. ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దెబ్బకు పవన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ఇంత పెద్ద హిట్ సినిమాను ముందుగా త్రివిక్రమ్ వేరే హీరో కోసం రాసుకున్నారంట. ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ మహేశ్ బాబు. మహేశ్ బాబు అయితేనే ఈ మూవీకి సెట్ అవుతారని త్రివిక్రమ్ అనుకున్నారంట. కానీ పవన్ అప్పటికే త్రివిక్రమ్ కోసం డేట్లు ఇచ్చేశారు.
Pawan Kalyan Starrer Attarintiki Daredi Movie Became Blockbuster Hit
గబ్బర్ సింగ్ తర్వాత తనతో సినిమా చేయాలని త్రివిక్రమ్ కు కమిట్ మెంట్ ఇచ్చాడు. దాంతో కాదనలేక త్రివిక్రమ్ కూడా తన దగ్గర ఉన్న అత్తారింటికి దారేది సినిమా కథతోనే షూటింగ్ చేశాడు. అలా మహేశ్ నటించాల్సిన సినిమాలో పవన్ కల్యాణ్ నటించాడు. దెబ్బకు పవన్ ఇమేజ్ డబుల్ అయిపోయింది.
Read Also : Sri Reddy : తెలుగు హీరోయిన్లు పక్కలోకి రారు.. అందుకే ఛాన్సులు ఇవ్వరు.. శ్రీరెడ్డి కామెంట్లు..!
Read Also : Anasuya Bhardwaj : తొమ్మిదేండ్లు అతనితో రిలేషన్ లో ఉన్న అనసూయ.. ఇన్నాళ్లకు బయట పడిందిగా..!