Payal Rajput : హీరోయిన్ గా రాణించాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ స్థాయికి రావడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. ఎంతో మంది ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్నా సరే వారు కెరీర్ తొలినాళ్లలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కోవాల్సిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వస్తున్న వారికి ఇది కచ్చితంగా ఓ పెద్ద సమస్యగానే ఉంది.
అయితే ఇప్పుడు కాస్త ట్రెండ్ మారుతోంది. మీటూ ఉద్యమం తర్వాత చాలామంది దీనిపై స్పందిస్తున్నారు. తమకు జరిగిన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇలాంటి లిస్ట్ లోకి తాజాగా పాయల్ రాజ్ పుత్ కూడా వచ్చేసింది. ఆమె పంజాబీ సినిమాలతోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది.
కానీ ఇప్పుడు తెలుగు సినిమాలతో బాగా ఫేమస్ అవుతోంది. అయితే ఆమె గతంలో పంజాబీలో ఓ యాడ్ కోసం ట్రై చేసింది. ఆ యాడ్ డైరెక్టర్ ఆడిషన్ కోసం ఆమెను తన ఆఫీస్ కు రమ్మన్నారంట. అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు షాక్ ఎదురైంది. ఆ డైరెక్టర్ ఆమెను అసభ్యకరంగా తాకడం స్టార్ట్ చేశాడంట.
ఏదో సీన్ చెప్పే ప్రయత్నంలో అసభ్యంగా తాకుతూ.. నా రూమ్ వస్తావా నీకు ఈ ఛాన్స్ ఇప్పిస్తా అంటూ దారుణంగా మాట్లాడాడంట. దాంతో పాయల్ కు భయం వేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత అతన్ని కలవకుండా తన ట్యాలెంట్ తోనే సినిమాల్లో ఛాన్సులు పడుతోంది ఈ భామ.
Read Also : Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Tamannaah Bhatia : ఏంటి.. తమన్నాకు ఆ చెత్త అలవాటు ఉందా.. మానలేక పోతుందా..?