Payal Rajput Expressed Anger At Netizens : పాయల్ రాజ్ పుత్ అంటే యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొదటి మూవీతోనే బోల్డ్ గా నటించింది. ఇంతటి బోల్డ్ నెస్ ను ఎవరూ ఊహించలేదు. దెబ్బకు పాయల్ కు కుర్రాళ్లలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కానీ ఆ క్రేజ్ ను ఆమె సరిగ్గా వాడుకోలేకపోయింది.
ఆ తర్వాత చాలా సినిమాల్లో ఛాన్సులు వచ్చినా ఎక్కువగా బోల్డ్ పాత్రలు మాత్రమే వచ్చాయి. దాంతో పాయల్ రాజ్ పుత్ కు హిట్లు పెద్దగా రాలేదు. ఇప్పటికీ వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది ఈ భామ. ప్రస్తుతం మంగళవారం అనే సినిమాలో నటిస్తోంది. అయితే గతంలో ఆమె కాస్టింగ్ కౌచ్ మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
నేను కూడా ముంబైలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎదుర్కున్నాను. మీటూ ఉద్యమం నడుస్తున్న సమయంలో నేను సినిమాల్లో ఛాన్సుల కోసం తిరుగుతున్నాను. కానీ ఎన్నడూ ఎలాంటి కమిట్ మెంట్లకు లొంగిపోలేదు. నేను ఆర్ ఎక్స్ 100 సినిమాలో నటించాను. బోల్డ్ సీన్లు చేసినంత మాత్రాన ఛాన్సుల కోసం కమిట్ మెంట్లు ఇవ్వను.
పెద్ద సినిమాల్లో ఛాన్సుల కోసం నేను సెక్స్ కు ఒప్పుకోను అంటూ తెగేసి చెప్పేసింది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు తాను పొందిన అవకాశాలు అన్నీ తన ట్యాలెంట్ తోనే వచ్చాయని తెలిపింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. మరి మంగళవారం సినిమా ఆమెకు మరో హిట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి.