Photo Of Mishti Chakraborty Drink Gone Viral : సాధారణంగా సినిమా స్టార్లు అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారనే పేరుంది. పైగా హీరోయిన్లు మందు తాగుతారనే చెడ్డ పేరు కూడా సంపాదించుకున్నారు. ఈ పేరుకు తగ్గట్టే ఇప్పటి హీరోయిన్లు ఎక్కువగా జల్సాలు చేస్తూ వస్తున్నారు. పైగా వారి పార్టీ అంటే కచ్చితంగా కాస్ట్లీ మందు ఉండాల్సిందే అన్నట్టు తయారవుతున్నారు.
కొందరు హీరోయిన్లు తాము మందు తాగుతున్నట్టు పైకి కనపడకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం తాము తాగుతున్న విషయాన్ని సమాజానికి తెలిసే విధంగా చేస్తుంటారు. ఇలాంటి వారిలో తాజాగా మరో హీరోయిన్ కూడా యాడ్ అయిపోయింది. ఆమెనే మిష్టీ చక్రవర్తి.
ఆమె తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన చిన్నదాన నీకోసం సినిమాలో నటించింది. అంతకు ముందు కూడా ఎన్నో అడల్ట్ సినిమాల్లో నటించింది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి ఆమె చేసే పాత్రలు. ఇదిలా ఉండగా తాజాగా ఆమె మందు తాగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ఓ పార్టీలో ఆమె మందు తాగుతూ చిల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె పొరపాటున ఫేస్ బుక్ స్టోరీలో పోస్టు చేసింది. ఇంకేముంది క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయిపోయింది. కానీ కొన్ని నిముషాల్లోనే డిలీట్ చేసింది. ఏం లాభం.. అప్పటికే అందరూ ఆ వీడియోను డౌన్ లోడ్ చేసి షేర్ చేస్తున్నారు.