Poonam Kaur Controversial Comments On Pawan Kalyan : పూనమ్ కౌర్ ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి బాంబు పేల్చుతుందో చెప్పలేం. ఆమెచేసే కామెంట్లు ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే ఉంటాయి. పూనమ్ కౌర్ కు పవన్ కల్యాణ్ కు ఏదో ఉందనే వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడప్పడు పవన్ హేటర్స్ కొందరు ఇవే కామెంట్లు చేస్తుంటారు.
గతంలో పోసాని కృష్ణ మురళి కూడా ఇవే కామెంట్లు చేశాడు. కాకపోతే పూనమ్ కౌర్ పేరు తీయకుండా ఇన్ డైరెక్టుగా చేశాడు. ఇక పూనమ్ మాత్రం అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూనే ఉంటుంది. మొన్న బండ్ల గణేశ్ ట్వీట్ కు బదులిస్తూ.. అమ్మాయిల జీవితాల ను నాశనం చేసేవాడు గురువు ఎలా అవుతాడని పవన్ మీద విమర్శలు గుప్పించింది.
తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి ఆమె సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మీ దృష్టిలో హీరో అంటే ఎవరు అని అడగ్గా.. అమ్మాయిల జీవితాలను నాశనం చేసేవారే ఇప్పుడు హీరోగా ఉంటున్నారు. హీరోయిన్లను వేధించే వ్యక్తి హీరో ఎలా అవుతాడు.
పైగా అతనికి అభిమానులు కూడా భారీగా ఉండటం హాస్యాస్పదం అంటూ సెటైర్లు వేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇన్ డైరెక్ట్ గా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించే చేసినట్టు ఉన్నాయి. ఆమె రిప్లై మీద పవన్ అభిమానులు విరుచుకు పడుతున్నారు. పవన్ ను ఇలాంటి కామెంట్లు చేసే అర్హత నీకు లేదని చెబుతున్నారు.
Read Also : Nithya Menon Comments On Director : నడుము కొలతలు చూపించమన్నారు.. నిత్యా మీనన్ ఎమోషనల్ కామెంట్లు..!