Tollywood : టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలు ఎంతోమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అందంలో బాలీవుడ్ హీరోలను మించిన వారు కూడా ఉన్నారు. అందుకే కోలీవుడ్ హీరోలతో పోలిస్తే తెలుగు హీరోలకే అమ్మాయిల్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. తెలుగులో అత్యధికంగా అమ్మాయిల ఫాలోయింగ్ మెయింటేన్ చేసిన హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం ప్రభాస్ గురించే. అవును అమ్మాయిల ఫాలోయింగ్ లో ప్రభాస్ టాప్ లో ఉన్నాడు. నలభై ఏండ్లు వస్తున్నా సరే ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు. పైగా హ్యాండ్సమ్ లుక్ లో ఉండటం, ఆరడుగుల అందగాడిగా ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చింది.
Prabhas At Top Following Of Girls In Tollywood
ఈ కారణాల వల్ల అమ్మాయిల ఫాలోయింగ్ ను ఎక్కువ కాలం మెయింటేన్ చేసిన హీరోగా నిలిచిపోయాడు ప్రభాస్. ఇక ఇప్పుడు ఆయనకు కాస్త ఫాలోయింగ్ తగ్గుతోంది. ఈ క్రమంలోనే ఓ యంగ్ హీరో ఆయన ప్లేస్ ను కొట్టేయాలని చూస్తున్నాడు. ఇంతకీ అతనెవరో కాదండోయ్ విజయ్ దేవరకొండ.
అవును ఇప్పుడు అమ్మాయిలకు విజయ్ అంటే పిచ్చి. అమ్మాయిలను రౌడీలుగా మార్చింది కూడా ఈ హీరోనే. అందుకే కాబోలు విజయ్ కు అంతగా ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆయన తర్వాత స్థానంలో పెద్దగా ఎవరూ లేరనే చెప్పుకోవాలి. మరి ఈ ఇద్దరు హీరోలపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read Also : Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ ఎంట్రీ.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!
Read Also : Prabhas : ఆమెతో నటించాలని ఉంది.. ప్రభాస్ మనసు దోచుకున్న ఏకైక హీరోయిన్ ఆమెనే..!