Prabhas Look Released From Project K : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ ”ప్రాజెక్ట్ కే”.. ఈ సినిమా గత రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అప్పటి నుండి ఎన్నో కారణాల వల్ల వాయిదా పడుతూ చిన్న షూట్ పూర్తి చేసుకుంటూ వస్తుంది.
అయితే ఇంత గ్యాప్ ఉన్న ఈ సినిమా నుండి ఎటువంటి ఇంఫర్మేషరన్ లీక్ కాకుండా నాగ్ అశ్విన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. మరి ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత ఈ సినిమా నుండి వరుసగా అప్డేట్ లను అందిస్తూ ఫ్యాన్స్ లో పిచ్చ క్యూరియాసిటీని పెంచుకుంటూ పోతున్నాడు.. ఇటీవలే ఈ సినిమా నుండి టీజర్ అండ్ టైటిల్ అందిస్తాను అని తెలిపారు.
ఇక అప్పటి నుండి ఈ సినిమా అప్డేట్ లను వరుసగా ఇస్తున్నారు.. జులై 21న టీజర్ అండ్ టైటిల్ రిలీజ్ చేయడానికంటే ముందుగానే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. నిన్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయే స్పందన లభించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ లుక్ రివీల్ చేసారు.
Prabhas Look Released From Project K
ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. ప్రభాస్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఐరన్ మ్యాన్ గెటప్ లో ఐరన్ సూట్ వేసుకుని గడ్డం, పొడవాటి జుట్టుతో మాములుగా కనిపించడం లేదు.. ఇక బ్యాక్గ్రౌండ్ లో సూర్యుడిని చూపించారు.. ఎట్టకేలకు లుక్ అయితే రావడం అందరి నుండి పాజిటివ్ కామెంట్స్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Read Also : Anchor Bharti Singh Comments An Interview : నన్ను తల్లిని చేయండి.. రెడీగా ఉన్నా అంటున్న టాప్ యాంకర్..!