Prabhas : ఆరడుగుల అందగాడు ప్రభాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ అంటే అమ్మాయిలకు చాలా పిచ్చి. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో అయినా నటించాలని చాలామంది హీరోయిన్లు ఎదురు చూస్తుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోల్లో అగ్ర స్థానంలో ఉన్నారు.
ఆయన చేతిలో అన్నీ బడా ప్రాజెక్టులే ఉన్నాయి. పైగా చేస్తున్న వాటితో ఆయన రేంజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అందుకే ఆయనతో నటించాలని చాలామంది బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.
ప్రభాస్ ఇంతమంది హీరోయిన్ల మనసు దోచుకుంటే.. ఆయన మనసును మాత్రం ఒకే ఒక్క హీరోయిన్ దోచుకుంది. ఆమె ఎవరో కాదండోయ్ బాలీవుడ్ అందాల భామ దీపికా పదుకొణె. అవును ఈ విషయం ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తనకు దీపికాతో నటించాలని కోరికగా ఉందని తెలిపాడు.
Prabhas Wants Act with Deepika Padukone
ఆమె చాలా ట్యాలెంటెడ్ యాక్టర్. ఒక్కసారైనా ఆమెతో కలిసి నటించాలని ఉంది అంటూ తెలిపాడు. ఇక ఇన్నాళ్లకు ప్రభాస్ కోరిక తీరుతోంది. ప్రాజెక్ట్ కే సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రాబోతోంది. దీంతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
Read Also : Mega Family : మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోయిన్ ఎంట్రీ.. వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!
Read Also : Mahesh Babu : అందరికంటే ఆ హీరోయిన్ అందంగా ఉంటుంది.. మహేశ్ బాబు కామెంట్లు..!