Prabhas : ఇప్పుడు ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ఆయన రేంజ్ నేషనల్ వైడ్ గా పెరిగిపోయింది. ఆయన తీస్తున్న సినిమాలు అన్నీ నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల దాకా తీసుకుంటున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ తో ఆదిపురుష్ చేస్తున్నాడు.
అలాగే సలార్ సినిమా, ప్రాజెక్ట కే ఇలా వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు ఈయన. గ్యాప్ లేకుండా వరుసగా మూవీలను ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ చేతిలో ఉన్నవన్నీ పెద్ద ప్రాజెక్టులే. ఇవి ఆయన రేంజ్ ను అమాంతం పెంచేస్తాయని చెబుతున్నారు ఆయన అభిమానలు.
ఇక లేడీ అభిమానుల సంగతి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయనంటే హీరోయిన్లు కూడా పడి చచ్చిపోతుంటారు. అలాంటి ఆయన మాత్రం ఒకే ఒక్క హీరోయిన్ పై మనసు పారేసుకున్నారు. ఆమె తన క్రష్ అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. ఇంతకీ ఆ అందాల భామ ఎవరా అనుకుంటున్నారా..
ఆమెనే నండి బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె. ఆమెకు పెండ్లి కాక ముందే ప్రభాస్ ఈ కామెంట్లు చేశాడు. ఆమె నా క్రష్.. ఆమెతో కలిసి నటించాలని ఉందంటూ అప్పట్లో చెప్పాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది దీపికా. వీరిద్దరి జంట ఎంత అందంగా ఉంటుందో చూడాలి.
Read Also : Kajal Aggarwal : కాజల్ కు లవ్ ఎఫైర్ అంటూ వార్తలు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Krithi Shetty : కృతిశెట్టికి అంత పొగరా.. ఆ హీరో కిస్ చేస్తే సబ్బుతో కడుక్కుందా..!