Prabhas Girlfriend Update : ఏంటీ ప్రభాస్ కు గర్ల్ ఫ్రెండ్ ఉందా.. నిజమేనా అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్నాడు ప్రభాస్. పైగా ఆయనకు హీరోయిన్లలో కూడా అభిమానులు ఉంటారు. అలాంటి ప్రభాస్ ఇప్పటికీ పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయాడు.
ఇక ఆయన మీద చాలా రూమర్లు వచ్చాయి. గతంలో త్రిషతో లవ్ లో ఉన్నాడని, ఆ తర్వాత అనుష్కతో పెళ్లి అని.. మొన్ననేమో కృతిసనన్ తో లవ్ ఎఫైర్ అంటూ ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి. కానీ అవేమీ నిజం కాదని ఎప్పటికప్పుడు నిరూపితం అవుతూనే ఉన్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్ గురించి ఓ సారి స్పందించాడు ప్రభాస్.
సాహో సినిమా ప్రమోషన్లలో ప్రభాస్ రాపిడ్ ఫైర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటూ యాంకర్ ప్రశ్నించింది. దానికి ప్రభాస్ స్పందిస్తూ.. ఉండొచ్చు.. ఉండకపోవచ్చు అంటూ డిఫరెండ్ ఆన్సర్ ఇచ్చాడు. దాంతో యాంకర్ షాక్ అయిపోయింది. ఏదో ఒక క్లారిటీ ఇవ్వకుండా అలా సస్పెన్స్ లో పెట్టేశాడు మన డార్లింగ్.
కానీ ప్రభాస్ కు గర్ల్ ఫ్రెండ్ లేదనేది అందరికీ తెలుసు. ఈ ఆరడుగుల అందగాడు పెండ్లి చేసుకుంటే చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. త్వరలోనే చేసుకుంటా అంటూ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నాడు మన డార్లింగ్. చూడాలి మరి ఆయన పెండ్లి చేసుకుంటాడో లేదో.