Prabhas : ఈ నడుమ ప్రభాస్ బయట ఎక్కడ కనిపించినా సరే క్యాప్ పెట్టుకునే కనిపిస్తున్నాడు. ఈవెంట్ ఏదైనా సరే ఆయన లుక్ మాత్రం క్యాప్ తోనే కనిపిస్తుంది. ఇది చూసిన ఆయన అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆ క్యాప్ అస్సలు బాలేదని చెబుతున్నారు. క్యాప్ లో చాలా వింతగా కనిపిస్తున్నావంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కానీ ప్రభాస్ మాత్రం ఎక్కడకు వెళ్లినా సరే క్యాప్ కంపల్సరి అంటున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుంచే ఇలా క్యాప్ మెయింటేన్ చేస్తున్నాడు. తాజాగా ఆయన ప్రశాంత్ నీల్ బర్త్ డే వేడుకలు నిర్వహించాడు. ఇందులో కూడా ఆయన క్యాప్ పెట్టుకున్నాడు. ఇదేంటి డార్లింగ్ అంటూ అడుగుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
అయితే తాజాగా దీనికి సంబంధించిన అసలు కారణం తెలిసిపోయింది. ప్రభాస్ హెయిర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారంట. హెయిర్ ట్రీట్ మెంట్లు తీసుకుంటున్నాడంట. ఈ క్రమంలోనే కొన్ని క్రీములు కూడా వాడుతున్నారంట. గాలి ఎక్కువగా తగలకుండా ఉండేందుకు ఆయన ఇలా క్యాప్ పెట్టుకుంటున్నాడని ఆయన టీమ్ తెలిపింది.
త్వరలోనే మళ్లీ ప్రభాస్ నార్మల్ లుక్ లో కనిపిస్తాడని అంటున్నారు. పైగా ఒకే సమయంలో నాలుగు సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఆ లుక్ బయటకు రాకుండా ఉండేందుకు ఇలా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఆయన నటించిన ఆదిపురుష్ మూవీ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆయన ప్రమోషన్స్ బిజీలో ఉంటున్నారు.
Also Read : Rana Daggubati : అలా చేస్తే తప్పేంటి.. శ్రీరెడ్డితో వివాదంపై స్పందించిన రానా..!
Also Read : Supreeta : మంచి అబ్బాయిని చూడండి.. మా అమ్మకు పెళ్లి చేస్తా.. సుప్రీత పోస్టు వైరల్..!