Prabhu Deva : ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కెరీర్ లో చాలా ఎత్తుకు ఎదిగాడు. ఎవరూ అందుకోలేనంత ఎత్తులో నిలబడ్డాడు. కేవలం డ్యాన్స్ మాస్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా సత్తా చాటుతున్నాడు. అయితే కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్న ఆయన.. వ్యక్తిగతంగా మాత్రం చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు.
గతంలో ఆయన ముస్లిం అమ్మాయి అయిన రమాలత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులు పుట్టిన తర్వాత నయనతారతో సహజీవనం చేశాడు. దాంతో రమాలత్ కు విడాకులు ఇచ్చేశాడు. వీరిద్దరిపై అప్పట్లో రమాలత్ ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టిపోసింది. దాంతో నయనతారను పెళ్లి చేసుకోకుండా వదిలేశాడు.
ఆ తర్వాత రెండేళ్ల పాటు తమన్నాతో కూడా ప్రభుదేవా డేటింగ్ చేశాడంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత సోనాక్షి సిన్హాతో కూడా ప్రేమలో పడ్డాడు మనోడు. ఆ తర్వాత అమీ జాక్సన్, దిశా పటానీ పేర్లు కూడా బాగానే వినిపించాయి. ఇక కరోనా సమయంలో ఆయన వెన్నెముకకు సమస్య వచ్చింది.
Prabhu Deva Personally Embroiled In Many Controversies
ఆ సమయంలో ఆయనకు ట్రీట్ మెంట్ ఇచ్చిన ఫిజియోథెరఫీ డాక్టర్ హిమానీ సింగ్ తో ఆయన ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక రీసెంట్ గానే ప్రభుదేవాకు ఓ కూతురు పుట్టింది. 50 ఏళ్ల వయసులో ఆయన ఇలా తండ్రి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Read Also : Vani Bhojan : ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్ కు రమ్మన్నాడు.. స్టార్ హీరోయిన్ సెన్సేషనల్..!
Read Also : Tamannaah Bhatia : తమన్నా లిప్ లాక్ ఇచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?