Priyamani : సినిమాలో చాలా ప్రేమజంటలు ఉన్నాయి. అందులో కొన్ని జంటలు పెళ్లి పీటలు ఎక్కాయి. మరికొన్ని మాత్రం డేటింగ్ వద్దనే ఆగిపోయాయి. ఇలాంటి జంటల్లో ప్రియమణి-తరుణ్ కూడా ఉన్నారు. అవును వీరిద్దరూ అప్పట్లో కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
అయితే ప్రియమణి మాత్రం అంతంత మాత్రంగానే తరుణ్ తో రిలేషన్ మెయింటేన్ చేసింది. ఆ సమయంలోనే తరుణ్ తల్లి వచ్చి ప్రియమణిని తన కొడుకుతో నీకు పెళ్లి చేస్తాఅంటూ తెలిపిందంట. కానీ ఆ సమయంలోనే ప్రియమణి వేరే స్టార్ హీరోతో ప్రేమలో పడిందంట. ఆ హీరోతో పెళ్లి చేసుకుంటే తన లైఫ్ సెటిల్ అవుతుందని భావించింది.
అందుకే తరుణ్ తో పెళ్లికి నో చెప్పేసింది. కానీ సదరు స్టార్ హీరో ఆమెతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాక.. పెళ్లి విషయంలో మాత్రం చాలా కండీషన్లు పెట్టాడు. ఆ కండీషన్లు భరించలేక ప్రియమణి అతనితో పెళ్లికి నో చెప్పింది. కొన్నాళ్ల పాటు ఆ బాధలో ఉండిపోయింది. తర్వాత తేరుకుని ముస్తాఫా రాజ్ ను రెండో పెళ్లి చేసుకుంది.
ముస్తఫాకు అప్పటికే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి. ఆ విషయం తెలిసి కూడా ప్రియమణి అతనితో ఏడు అడుగులు వేసింది. అయితే ఆమె కొంత కాలంగా భర్తకు దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ఇక తరుణ్ మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయాడు. త్వరలోనే అతనికి పెళ్లి చేస్తానంటూ ఆయన తల్లి చెబుతోంది. చూడాలి మరి ఎప్పుడు చేసుకుంటాడో.
Read Also : Samantha : హీరోల మీదే ఆధారపడాలి.. లేదంటే మాకు ఛాన్సులు రావుః సమంత
Read Also : Sai Pallavi : అక్కడ చేతులు వేసి నొక్కాడు.. చేదు అనుభవం చెప్పిన సాయిపల్లవి..!