Priyanka Chopra Dated A Friend : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చొప్రాకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కు ఎదిగిన ఈ బ్యూటీ.. ఇప్పటికీ వరుసగా హాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె వయసులో తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను పెండ్లి చేసుకుని ఓ పాపను కూడా కనింది.
వీరిద్దరూ ప్రస్తుతం యూఎస్ లోనే ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఆమె తన వ్యక్తిగత విషయాలను, తనకు జరిగిన అనుభవాలను పంచుకుంటూ ఉంటుంది. ఇక తాజాగా ప్రియాంక చొప్రా ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను బయట పెట్టేసింది. తాను కూడా గతంలో డేటింగ్ చేసినట్టు వెళ్లడించింది.
అది కూడా 18 ఏళ్లకే తన ఇంటికి దగ్గరగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డట్టు తెలిపింది. అతనితో దాదాపు రెండేళ్లు సహజీవనం చేశాను.. కానీ అతని ప్రేమలో నిజాయితీ లేదని తర్వాత తెలిసింది. కేవలం నాతో టైమ్ పాస్ చేశాడని అర్థమై చాలా బాధపడ్డాను. అతనిలో చేతిలో నేను మోసపోయాను.
చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. కానీ మా ఇంట్లో వారు ఇచ్చిన ధైర్యంతోనే కోలుకున్నాను. అప్పటి నుంచి మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేశాను. నాకు కాన్ఫిడెన్స్ లెవల్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే సినిమాల్లో త్వరగానే ఛాన్సులు అందుకున్నాను. ఇప్పుడు నా భర్తతో హ్యాపీగా ఉన్నాను అంటూ వివరించింది ఈ భామ.