Radhika Apte Commented On Star Director : రాధికా ఆప్టే అంటే ఇండియా వ్యాప్తంగా పేరుంది. ఆమె చేసే కామెంట్లు చాలా దుమారం రేపేతుంటాయి. ఇక బోల్డ్ నటిగా ఆమెకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఎలాంటి బోల్డ్ సీన్లు అయినా సరే రాధికా చేసినంతగా ఎవరూ చేయలేరనే చెప్పుకోవాలి. ఆమె దాదాపు అన్ని భాషల్లో సినిమాలు చేసింది.
అటు హిందీ నుంచి మలయాళం దాకా అన్ని భాషల్లో మెరిసింది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా బాగానే పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా రాధికా ఆప్టే ఇప్పుడు ఎక్కువగా లండన్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె మన నేషనల్ మీడియాకు లండన్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఈ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని ఇబ్బందులను వెల్లడించింది. తనకు సౌత్ ఇండస్ట్రీలో ఓ చేదు అనుభవం ఎదురైనట్టు చెప్పింది. ఓ స్టార్ హీరోతో సినిమాలో నటిస్తున్నప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ దారుణంగా ప్రవర్తించాడంట. సీన్ వివరించే క్రమంలో తన పక్క చైర్ లో కూర్చుని.. కావాలనే తనపై చేతులు వేశాడంట.
సడెన్ గా తన థైస్ మీద చేతులు వేసే సరికి ఇక కోపం ఆపుకోలేక.. అతని చెంప చెల్లుమనిపించిందంట. ఈ విషయాలను తాజాగా ఆమె వెల్లడించింది. దాంతో సెట్ లో ఉన్న వారంతా షాక్ అయిపోయారని తెలిపింది. డైరెక్టర్ కు విషయం చెప్పగానే.. ఆ తర్వాత రోజు నుంచే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ను తీసేసినట్టు స్పష్టం చేసింది.