Radhika Apte : సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే హీరోయిన్లకు ఇప్పుడు పర్ ఫెక్ట్ ఫిగర్ అనేది కంపల్సీర ఉండాల్సిందే. లేకపోతే మాత్రం వారిని ఎవరూ పట్టించుకోరు. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే కాస్త బొద్దుగా కనిపిస్తే అవకాశాలు తగ్గిపోతాయి. పైగా దారుణంగా ట్రోల్స్ కూడా వస్తాయి. ఇక కొందరికి అయితే కొన్ని పార్టులు సరిగా లేకపోతే వాటికి సర్జరీలు కూడా చేయించుకుంటారు.
ఇలాంటి పార్టుల విషయంలో కొన్ని సార్లు అవమానాలు కూడా భరించాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని తాజాగా రాధికా ఆప్టే కూడా వివరించింది. ఎలాంటి డేరింగ్ కామెంట్లు చేయడానికి అయినా సరే ఆమె అస్సలు వెనకాడదు. తెలుగులో లెజెండ్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది.
కానీ ఎక్కువగా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. ప్రస్తుతం పెండ్లి చేసుకున్న ఈ భామ.. పలు ఇంటర్వ్యూలలో దుమారం రేపే కామెంట్లు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే మాట్లాడుతూ… నేను కూడా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కున్నాను. కొందరు నా ముక్కు సరిగా లేదంటూ హేళన చేశారు.
ఇంకొందరు అయితే ఏకంగా నా వక్షోజాల సైజును పెంచుకోమంటూ చెత్త సలహాలు ఇచ్చారు. కానీ వాటిని నేను పట్టించుకోలేదు. అసలు నా బాడీలో ఏ పార్టుకు కూడా సర్జరీ చేయించుకోలేదు. కేవలం నన్ను నేను నమ్ముకుని అవకాశాలు అందుకున్నాను. నాలాగా చాలామంది ఇప్పుడు ఇలాంటి అవమానాలు భరిస్తున్నారు.. ఈ సంప్రదాయం ఎప్పుడు మారుతుందో ఏమో అంటూ చెప్పింది ఈ బ్యూటీ.
Read Also : Jabardasth Hari : ఎర్ర చందనం స్మగ్లర్ గా మారిన జబర్దస్త్ కమెడియన్.. పరారీలో ఉన్న నటుడు..!
Read Also : Divyansha Kaushik : అవును.. నాగచైతన్యను ప్రేమిస్తున్నా..దివ్యాంశ కౌశిక్ సంచలన ప్రకటన..!