Radhika Apte Made Sensational Comments On Tollywood Hero : రాధికా ఆప్టే స్వతహాగా మరాఠీ నటి అయినప్పటికీ ఆమె తెలుగులో కూడా ఫేమస్ అయింది. కేవలం తెలుగులోనే కాకుండా అటు తమిళం, హిందీ, మరాఠీ సినిమాల్లో కూడా బాగానే నటించింది. అయితే ఆమె మొదటి నుంచి బోల్డ్ నటిగానే ఫేమస్ అయింది. ఎన్నో సినిమాల్లో ఆమె పాత్రలో బోల్డ్ గానే ఉన్నాయి.
ఇక రాధికా ఆప్టే మొదటి నుంచి ఫైర్ బ్రాండ్ గానే పేరు తెచ్చుకుంది. ఆమె చేసే కామెంట్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఆమె లండన్ లో ఉంటుంది. అప్పుడప్పుడు ఇండియా వచ్చి సినిమాలు పూర్తి చేసుకుని వెళ్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో టాలీవుడ్ మీద కూడా కామెంట్లు చేసింది. నేను తెలుగులో కొన్ని సినిమాలు చేశాను. కానీ ఓ హీరోతో నటించేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. ఆయన కావాలనే అసభ్యకరంగా టచ్ చేశాడు. నన్ను కాదు ఆయనతో నటించే హీరోయిన్లను ఇలాగే అసభ్యకరంగా టచ్ చేస్తాడని విన్నాను.
కానీ ఆయన పెద్ద హీరో. పైగా వయసు కూడా ఎక్కువే. అందుకే ఆయన్ను ఏమీ అనలేకపోయాను. కానీ అలాంటి వారి మీద కచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే హీరోయిన్లకు భద్రత అనేది లేకుండా పోతుంది అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది రాధికా. కానీ ఆ తెలుగు హీరో ఎవరనేది మాత్రం ఆమె చెప్పలేదు. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.