Rakul Preet Singh Comments On Akkineni Nagarjuna : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసిన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత చాలా మారిపోయింది. సౌత్ నుంచి నార్త్ కు వెళ్లిన చాలా మంది ముద్దుగుమ్మలు.. సౌత్ హీరోలపై సంచలన కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం.
అయితే రకుల్ కూడా ఇప్పుడు ఇలాంటి కామెంట్లే చేసింది. తాజాగా ఆమె ఓ ప్రముఖ హిందీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సౌత్ లో అవకాశాలు తగ్గడానికి కారనం ఏంటని అడగ్గా.. ఆమె క్లారిటీ ఇచ్చింది. నాకు టాలీవుడ్ లో చాలా మంచి ఫేమ్ వచ్చింది. అక్కడే నాకు ఎక్కవ ఛాన్సులు వచ్చాయి.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే నేను ఓ సినిమాలో సీనియర్ హీరోతో కిస్ సీన్ చేశాను. దాన్ని ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేక పోయారు. ఆ సినిమా ప్లాప్ అయింది. అప్పటి నుంచే నాకు సౌత్ లో ఛాన్సులు తగ్గాయి అంటూ కామెంట్లు చేసింది రకుల్. అయితే ఆమె చేసిన కామెంట్లు నాగార్జునను ఉద్దేశించే చేసిందని అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఎందుకంటే ఆమె కిస్ సీన్ చేసిన సీనియర్ హీరో కేవలం నాగార్జున మాత్రమే. ఆయనతో మన్మథుడు-2 సినిమా చేసినప్పటి నుంచే ఆమెకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. కాబట్టి ఇప్పుడు తనకు ఛాన్సులు రాకపోవడానికి నాగార్జుననే కారణం అంటూ చెబుతోందని అంటున్నారు ఆడియెన్స్.
Read Also : Megha Akash In Love : నాలుగో క్లాస్ లోనే ప్రేమలో పడ్డా.. ఆ హీరోతో లవ్ లో ఉన్నా.. మేఘా ఆకాశ్ ఓపెన్..!