Rakul Preet Singh Made Bold Comments : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్ లో వరుసా సినిమాలతో చాలా బిజీగా మారిపోయింది. మొన్నటి వరకు ఆమె సౌత్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా బాగానే నటించింది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత ఎక్కువగా బోల్డ్ పాత్రల్లోనే మెరుస్తోంది. అంతే కాకుండా కాంట్రవర్సీ కామెంట్లు కూడా చేస్తోంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మరోసారి బోల్డ్ కామెంట్లు చేసింది. ఇప్పటి జనరేషన్ లో బోల్డ్ పర్ఫార్మెన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ ప్రశ్నించింది. దానికి రకుల్ స్పందిస్తూ.. యస్ ఇది మంచి ప్రశ్న. ఇప్పటి వరకు చాలామంది నన్ను ఇదే క్వశ్చన్ వేశారు.
ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. జనాల అభిరుచులు కూడా మారుతున్నాయి. సాఫ్ట్ గా ఉంటే ఎవరూ చూడట్లేదు. సినిమాలకు ఇప్పుడు గ్లామర్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉంటేనే ఆడుతున్నాయి. ఇప్పుడు నీట్ గా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కానీ కాస్త బోల్డ్ కంటెంట్ ను యాడ్ చేస్తేనే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే నేను సినిమాల కంటెంట్ ను బట్టి ఎలాంటి పాత్రలు వచ్చినా ఓకే చేస్తున్నాను. ఒక నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎలాంటి పాత్రలో అయినా నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్.