Ram Charan : రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అని అందరికీ తెలుసు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఆయన ఇప్పుడు ఇండియన్ హీరో అయిపోయాడు. దాంతో ఆయన క్రేజ్, మార్కెట్ అమాంతం పెరిగిపోయాయి. కానీ వాస్తవంగా రామ్ చరణ్ గతంలోనే పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సి ఉండేది.
అది కూడా రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన మగధీర సినిమాతో. ఆ సినిమాను అల్లు అరవింద్ నిర్మించారు. అయితే ఈ సినిమా చరణ్ కు రెండోది. అనుకున్నదాని కంటే చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అదే సమయంలో రాజమౌళి ముందే అల్లు అరవింద్ కు చెప్పాడంట.
ఈ మూవీని తమిళ్, మలయాళం, హిందీలో రిలీజ్ చేద్దామని. కానీ రామ్ చరణ్ కు ఇది రెండో సినిమా. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే ఆయన ఇమేజ్ తోపాటు చిరంజీవి ఇమేజ్ కూడా పోతుందని చెప్పి అల్లు అరవింద్ అడ్డుపడ్డాడంట. రాజమౌళికి మాత్రం సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అందుకే రిలీజ్ చేయాలని చిరు మీద కూడా ప్రెషర్ పెట్టాడు.
కానీ అల్లు అరవింద్ మాటను కాదనలేక చిరు కూడా రాజమౌళికి సర్ది చెప్పాడు. కానీ మూవీ విడుదలై ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టేసింది. కానీ అప్పటికే రాజమౌళి వేరే భాషల్లో రిలీజ్ చేసే విషయంలో అప్సెట్ గా ఉన్నాడు. అందుకే హిట్ అయిన తర్వాత కూడా రాజమౌళి సైలెంట్ గా ఉండిపోయాడు.
Ram Charan Could Not Become Pan India Star with Magadheera Movie
ఒకవేళ హిట్ అయిన తర్వాత వేరే భాషల్లో రిలీజ్ చేసినా అప్పటికే చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యేవాడు. కానీ అల్లు అరవింద్ నిర్ణయం వల్ల ఆగిపోయింది. అందుకే అప్పట్లో మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ కారణంగానే చరణ్ పాన్ ఇండియా హీరో కాలేకపోయాడని దారుణంగా తిట్టుకున్నారు.
Read Also : Divi Vadthya : కమిట్ మెంట్ ఇస్తే తప్పేంటి.. ఇద్దరు ఒప్పుకుంటేనే అది జరుగుతుందిః బిగ్ బాస్ దివి
Read Also : Varun Tej : లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ పెళ్లి నాగబాబుకు ఇష్టం లేదట.. ఇదిగో ప్రూఫ్..!