Ram Gopal Varma : కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తారో చెప్పలేం. ఏ హీరోను పొగుడుతాడో.. ఏ హీరోను తిడుతాడో కూడా తెలియదు. అది కేవలం ఆయన నైజం మాత్రమే. అయితే ఇప్పుడు టాలీవుడ్ పరిమితి పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగులో అందరూ పాన్ ఇండియా హీరోలు పుట్టుకొస్తున్నారు.
అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్జీవీ ఈ పాన్ ఇండియా క్రేజ్ మీద మాట్లాడారు. అసలు పాన్ ఇండియా అనేది ఒక వేవ్ మాత్రమే. సినిమాలో కంటెంట్ ఉంటేనే ఎవరైనా చూస్తారు. లేదంటే ఆ పాన్ ఇండియా క్రేజ్ అనేది పోగొట్టుకున్న వారే అవుతారు. మన తెలుగు హీరోలకు తెలుగులోనే వీరాభిమానులు ఉంటారు.
కానీ వేరే భాష వారు మాత్రం సినిమాలో కంటెంట్ ను మాత్రమే చూస్తారు. మన తెలుగులో ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా స్టార్లు అందరూ కేవలం రాజమౌళి వల్లే అయ్యారు. కానీ కేవలం అల్లు అర్జున్ మాత్రమే రాజమౌళి సపోర్టు లేకుండా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సాధించాడు. బాలీవుడ్ లో గ్లామర్ గా ఉంటేనే చూస్తారు.
కానీ పుష్పలో ఆయన డీ గ్లామర్ పాత్రలో నటించి కూడా పెద్ద స్టార్ గా నిరూపించుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అందుకే తెలుగులో అసలైన హీరో అంటే కేవలం బన్నీ మాత్రమే అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు ఆర్జవీ. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు మిగతా హీరోలకే మండేలా చేస్తున్నాయి.
Read Also : SS Rajamouli : రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి పేరు తెచ్చుకున్న హీరో ఎవరో తెలుసా..?
Read Also : Karate Kalyani : ఐదు నిముషాల సుఖం కోసం కక్కుర్తి పడొద్దు.. నటి కరాటే కల్యాణి సంచలన కామెంట్లు..!