Ram Gopal Varma : రాజమౌళి హత్యకు కుట్ర.. సంచలన మ్యాటర్‌ లీక్‌ చేసిన ఆర్జీవీ..!

Ram Gopal Varma : రాజమౌళి హత్యకు కుట్ర జరుగుతోందని చెప్పాడు రామ్ గోపాల్‌ వర్మ. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాజాగా ఆయన వరుసగా ట్వీట్లు చేశారు..

By: jyothi

Updated On - Tue - 24 January 23

Ram Gopal Varma : రాజమౌళి హత్యకు కుట్ర.. సంచలన మ్యాటర్‌ లీక్‌ చేసిన ఆర్జీవీ..!

Ram Gopal Varma : ఈ నడుమ రాజమౌళి పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ముఖ్యంగా ఆయన తీసిన త్రిబుల్‌ ఆర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఆ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా సొంతం అయిపోయింది. దాంతో పాటు ఆ మూవీ ఆస్కార్ నామినేషన్స్‌ లో కూడా ఉంది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌ దర్శకులు సైతం రాజమౌళిని పొగుడుతున్నారు.

మొన్నటికి మొన్న అవతార్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ కూడా రాజమౌళిని అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు. ఇలాంటి తరుణంలో రాజమౌళి హత్యకు కుట్ర జరుగుతోందని చెప్పాడు రామ్ గోపాల్‌ వర్మ. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. తాజాగా ఆయన వరుసగా ట్వీట్లు చేశారు.

మందు కిక్కులో చెప్తున్నా..

రాజమౌళి గారు మీ భద్రతను పటిష్టం చేసుకోంది. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొందరు ఇండియన్‌ డైరెక్టర్లు గ్రూపుగా మారి మీ హత్యకు కుట్ర చేస్తున్నారు. ఆ గ్రూప్‌ సభ్యులలో నేను కూడా భాగమే. మందు కిక్కులో ఇలా మ్యాటర్‌ లీక్‌ చేస్తున్నా అంటూ ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ.

దాంతో ఈ ట్వీట్లు ఇప్పుడుసంచలనం రేపుతున్నాయి. అంటే రాజమౌళి ఎదుగుదళను కొందురు ఇండియన్ డైరెక్టర్లు ఓర్వలేకపోతున్నారని ఆర్జీవీ ఇలా ఇన్‌ డైరెక్టుగా చెప్పాడన్న మాట. ఆర్జీవీ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జక్కన్నను చూసి అసూయపడుతున్నారు.

 

 

 

Read Also : Sunny Leone-Saddam : సన్నీలియోన్‌ తో ఆ ఎక్స్‌ పీరియన్స్‌ సూపర్.. సద్దాం అంత మాట అన్నాడేంట్రా బాబు..!

Read Also : Tollywood Stars : టాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరో అతనే.. తేల్చేసిన సర్వేలు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Related News