Rana Daggubati : హీరో రానాకు విలక్షణ నటుడిగా పేరుంది. ఆయన చాలా సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో మెరిశారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రానా.. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా ఎన్నో పాత్రల్లోనటిస్తున్నారు. బాహుబలి తర్వాత నుంచే ఆయన విలన్ గా రాణిస్తున్నారు.
గతేడాది వచ్చిన భీమ్లానాయక్ సినిమాలో కూడా ఆయన విలన్ పాత్రలో మెరిశారు. ఇక రీసెంట్ గానే రానా నాయుడు వెబ్ సిరీస్ లో తన బాబాయ్ వెంకటేశ్ తో కలిసి నటించారు. అయితే ఈ వెబ్ సిరీస్ కారణంగా ఆయన విమర్శలు కూడా ఎదుర్కున్నారు. ఇక ప్రస్తుతం ఆయన తమ్ముడు అభిరామ్ నటించిన అహింస సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.
ఈ క్రమంలోనే రానాకు సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ లోనే రానా నాయుడు ఫ్యామిలీకి బడా బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఎందుకంటే రానా తాత రామానాయుడు అప్పట్లో పెద్ద ప్రొడ్యూసర్. ఆయన తర్వాత రానా తండ్రి సురేష్ బాబు కూడా ఎన్నో సినిమాలను నిర్మిస్తున్నారు.
ఈ విధంగా రానాకు చాలానే ఆస్తులు సంక్రమించాయి. ఆయనకు ఫిలింనగర్ లో ఖరీదైన ఇల్లు ఉంది. నిర్మాణ సంస్థలు ఉన్నాయి. థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక లగ్జరీ కార్లకు కొదువే లేదు. వేల కోట్ల విలువ చేసే భూములు, ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. ఆయన ఆస్తి దాదాపు రూ.8వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
Also Read : Bellamkonda Ganesh : బాలయ్య ఇంట్లో కాల్పులపై స్పందించిన బెల్లంకొండ గణేశ్..!
Also Read : Heroines : తల్లిదండ్రులపైనే కేసులు పెట్టిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?