Rana Daggubati : దగ్గుబాటి రానా చాలా ఓపెన్ గా ఉంటారు. ఎన్నో విషయాలను ఆయన బటయకు చెబుతూ ఉంటారు. ప్రభాస్, రాజమౌళికి సంబంధించిన ఎన్నో సీక్రెట్ విషయాలను కూడా రానా బయటకు తెలియజేశారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పరేషాన్ మూవీ కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు.
దగ్గుబాటి రానా సమర్పణలో వస్తున్న ఈ మూవీకి ఆయన జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలన పంచుకున్నాడు. అయితే ఈ ఇంటర్వ్యూ రానా తమ్ముడు అభిరామ్ నటిస్తున్న అహింస మూవీ గురించి కూడా ఓ ప్రశ్న వేశాడు యాంకర్.
మీ తమ్ముడి సినిమాకు ఎందుకు ప్రమోషన్స్ చేయట్లేదు.. భయపడుతున్నారా అంటూ ఫన్నీగా అడిగాడు. కానీ ఆయన ప్రశ్నలో ఇన్ డైరెక్టుగా శ్రీరెడ్డికి భయపడే ప్రమోషన్స్ చేయట్లేదేమో అన్నట్టు ఉంది. అయితే దీనికి రానా స్పందించాడు. తమ్ముడి సినిమాకు తేజ గారు ఉన్నారు. ఆయన చేస్తే తప్పేంటి.
నేను నా వరకు తమ్ముడికి సపోర్టుగానే ఉంటాను. ఎవరికీ భయపడాల్సిన అవసరం నాకేంటి. మేం బాగానే ఉన్నాం మాకేం ప్రాబ్లమ్ లేదు అంటూ ఇన్ డైరెక్టుగా ఆన్సర్ ఇచ్చాడు రానా. అంటే తాము శ్రీరెడ్డికి భయపడట్లేదని ఆయన ఇలా తెలిపాడన్నమాట. మరి ఈ కామెంట్ల మీద శ్రీరెడ్డి ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.
Read Also : Vishnu Priya : ఆ డైరెక్టర్ నన్ను రూమ్ కు రమ్మన్నాడు.. విష్ణుప్రియ సంచలనం..!
Read Also : SS Rajamouli : ఆ హీరోతో సినిమా కోసం ఏళ్లుగా వెయిట్ చేస్తున్నా.. రాజమౌళి కామెంట్లు వైరల్..!