Rashmi Gautam Post Is Creating Sensation : యాంకర్ గా రష్మీకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె బుల్లితెరపై ఓ సెన్సేషన్. ఆమె యాంకర్ గా పదేండ్లుగా చేస్తోంది. కానీ ఇంకా తన క్రేజ్ తగ్గలేదు. జబర్దస్త్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఇప్పటికీ అందులోనే కొనసాగుతోంది. వరుసగా అవకాశాలు పట్టేస్తోంది. కాగా కెరీర్ పరంగానే కాకుండా సోషల్ మీడియా తో ఎక్కువగా పాపులర్ అయిపోయింది.
ఎప్పటికప్పుడు అనేక విషయాల మీద స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, మూగ జంతువుల విషయంలో తన వాయిస్ ను వినిపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఆమె చేసిన పోస్టు మరో సంచలనం రేపుతోంది. రీసెంట్ గా రజస్వల అయిన 12 ఏళ్ల బాలిక అక్రమ సంబంధం పెట్టుకుందని భావించి చంపేశారట.
ఇది ఎక్కడ జరిగిందో రష్మీ మాత్రం చెప్పలేదు. అయితే ఇదంతా సెక్స్ మీద అవగాహన లేకపోవడం వల్లనే జరిగిందని రష్మీ చెబుతోంది. సమాజంలో అందరికీ దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇలాంటి ఘోరాలు జరుగకుండా ఆపగలుగుతాం అంటూ ఆమె తన పోస్టులో వెల్లడించింది.
ఇక రష్మీ పోస్టుకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమెను విమర్శిస్తున్నారు. చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు చెప్పి ఇంకా చెడగొట్టాలని నీ ఉద్దేశమా అంటూ అడుగుతున్నారు. ఏదేమైనా రష్మీ ఇలాంటి నెగెటివ్ కామెంట్లను పెద్దగా పట్టించుకోదని మనకు తెలిసిందే.
Read Also : Naga Shaurya Responded On Love Affairs : ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు రాయండి ప్లీజ్.. నాగశౌర్య వింత కోరిక..!