Rashmika Mandanna Faces Trolls From Netizens : రష్మిక మందన్నా ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. కన్నడ నుంచి వచ్చిన ఈ భామకు తెలుగులోనే స్టార్ స్టేటస్ దక్కింది. అప్పటి నుంచి ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ముఖ్యంగా పుష్ప సినిమా ఆమె ఫేమ్ ను మార్చి పడేసింది. అప్పటి నుంచే ఆమె తిరుగులేని స్టార్ డమ్ ను పొందింది.
అయితే ఒకానొక సమయంలో ఆమె కూడా దారుణంగా ట్రోల్స్ ను ఎదుర్కుందంట. ఈ విషయాలను తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. అప్పట్లో నేను స్టార్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలు చేశాను. ముఖ్యంగా డియర్ కామ్రేడ్ సినిమాలో కొన్ని లిప్ లాక్ సీన్లు చేశాను.
అప్పుడు నన్ను దారుణంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో తిడుతూ పోస్టులు పెట్టారు. చాలా బాధపడ్డాను. నేను చాలా సెన్సిటివ్. ఎవరు ఏమన్నా సరే తట్టుకోలేను. నాకు అలాంటి ట్రోల్స్ అదే మొదటిసారి. కానీ నా సన్నిహితులు, ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇదంతా కామన్.. అంతా సర్దుకుంటుంది అని ధైర్యం చెప్పారు.
Rashmika Mandanna Faces Trolls From Netizens
ఒక నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అలాంటి సీన్లు చేయాల్సిందే తప్పదు. సినిమా రంగంలో ఉంటే ఇంతకన్నా ఎక్కువ ట్రోల్స్ ఫేస్ చేస్తున్న వారిని కూడా చూశాను. కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఎవరేం అన్నా సరే పాజిటివ్ గానే తీసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఇక ఆమె విజయ్ తో చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.