Rashmika Mandanna : హీరోయిన్ రష్మిక ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. తెలుగు నుంచి మొదలు పెడితే అటు బాలీవుడ్ దాకా ఆమెకు తిరుగు లేకుండా పోయింది. అన్ని భాషల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. ఆమె లాగా అన్ని భాషల్లో అభిమానులు ఉన్న హీరోయిన్లు చాలా అరుదు అనే చెప్పుకోవాలి. అందుకే ఇప్పుడు ఆమెకు అన్ని భాషల్లో సినిమా ఛాన్సులు వస్తున్నాయి.
రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. అదే సమయంలో ఇటు తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు శాకుంతలం ఫేమ్ దేవ్ కట్టా హీరోగా వస్తున్న సినిమాలో కూడా చేస్తోంది. ఇలా వరుస ప్రాజెక్టులతో హైప్ పెంచేస్తోంది ఈ భామ. ఇదిలా ఉండగా ఆమె గతంలో తనకు కాబోయే భర్తపై చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆమె గతంలో ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో రష్మిక మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్తతో నేను చాలా సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి. అన్ని విషయాలను ఆయనతో షేర్ చేసుకునే విధంగా ఉండాలి. పైగా నా వృత్తిని గౌరవించాలి. అలాంటి వ్యక్తినే నేను నా భర్తగా ఎంచుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
అయితే ఆమె విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్లు అచ్చం విజయ్ ను ఉద్దేశించే చేసినట్టు ఉన్నాయని చెబుతున్నారు రష్మిక అభిమానులు. ఎందుకంటే విజయ్ ఆమెను సినిమాల పరంగా బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. చూడాలి మరి ఈ ఇద్దరూ పెండ్లి పీటలు ఎక్కుతారా లేదా అనేది.
Read Also : Director Sujeeth : ఓజీ డైరెక్టర్ సుజిత్ భార్యను చూశారా.. హీరోయిన్లు కూడా పనికి రారు..!
Read Also : Malavika Nair : ఆ దర్శకుడిని ఉంచుకుంటా.. హీరోయిన్ పచ్చి బూతులు..!