Rashmika Mandanna Gave Shock Vijay Deverakonda : రష్మిక అంటే కుర్రాళ్లు పడిచస్తుంటారు. ఎందుకంటే ఆమె అందం, అభినయానికి అంత క్రేజ్ ఉంది మరి. నార్త్ నుంచి సౌత్ దాకా ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు చాలా సినిమాలతో బాక్సాఫీస్ వద్ద లక్కీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. యంగ్ హీరోలు అందరూ రష్మికతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక రష్మిక చాలా కాలంగా విజయ్ దేవరకొండతో డేటింగ్ లో ఉంది. కానీ అధికారికంగా చెప్పట్లేదు. అప్పుడప్పుడు ఇద్దరూ వెకేషన్లకు సీక్రెట్ గా వెళ్తున్నారు. అక్కడ వేర్వేరుగా ఫొటోలు దిగుతూ ఒకేసారి పోస్టు చేసి దొరికిపోతున్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చేసింది రష్మిక.
తాజాగా ఆమె ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పుడున్న హీరోల్లో మీ ఫేవరెట్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించింది. దానికి ఆమె సమాధానం చెప్తూ.. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. అతనికి నేను పెద్ద అభిమానిని. చాలా కాలంగా అతనితో యాక్ట్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాను అంటూ తెలిపింది.
Rashmika Mandanna Gave Shock Vijay Deverakonda
ఒకవేళ మీకు ప్రభాస్ తో ఒకరోజు డేటింగ్ ఆఫర్ వస్తే ఏమంటారు అని యాంకర్ అడిగింది. దాంతో రష్మిక స్పందిస్తూ.. కచ్చితంగా స్వీకరిస్తాను. అది నాకు దొరికిన అదృష్టంగా భావిస్తాను అంటూ తెలిపింది. దాంతో ఈ కామెంట్లతో విజయ్ ను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. విజయ్ దేవరకొండకు పెద్ద రాడ్ దింపేసిందని అంటున్నారు.