Rashmika Mandanna : హీరోల మధ్యనే కాదు హీరోయిన్ల మధ్య కూడా తీవ్రంగా పోటీతత్వం పెరిగిపోయింది. అయితే టాలీవుడ్ లో ఒక్కోసారి ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటుంది. ఇక టాలీవుడ్ విషయంలో కూడా ఎవరు నెంబర్ వన్ అనే టాక్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ హీరోయిన్ అనే టాక్ బలంగా నడుస్తోంది.
ఈ క్రమంలోనే రష్మిక మందన్నా పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో రష్మికకు ఉన్నంత ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదు. పైగా రష్మిక చేతిలో ఉన్నన్ని బడా ప్రాజెక్టులు ఇంకెవరి చేతిలో లేవు. సక్సెస్ రేటు కూడా ఆమెకే ఎక్కువగా ఉంటుంది. పైగా రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమెదే పైచేయి.
ఇక రష్మికకు సోషల్ మీడియాలో కూడా అధికంగా ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్లకు లేనంత ఫాలోయింగ్ ఉంది. పూజాహెగ్డే, తమన్నా, కృతిశెట్టి, శ్రీలీల పేర్లు వినిపిస్తున్నా.. వీరికి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ లేదు. కానీ రష్మికకు మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది.
ఇలాంటి అనేక లక్షణాలు ఆమెను టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఇక ఆమె నటించిన సినిమాలకు కూడా రికార్డు స్థాయిలో మార్కెటింగ్ జరుగుతోంది. త్వరలోనే రష్మిక నుంచి మరో రెండు సినిమాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఆమె హవా ముందు ముందు ఏ స్థాయిలో కొనసాగుతుందో.
Read Also : Actress Anjali : ఏంటీ.. డబ్బుల కోసం ఆ డైరెక్టర్ తో హీరోయిన్ అంజలి ఎఫైర్ పెట్టుకుందా..?
Read Also : Tamannaah Bhatia : తమన్నా ప్రైవేట్ పార్టులపై చేయి వేసిన నటుడు.. ఏంటీ దారుణం..!