Rashmika Mandanna : రష్మిక ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఏ హీరోయిన్ కు అయినా ఒక్క ఇండస్ట్రీలో మాత్రమే ఫ్యాన్స్ ఉంటారు. కానీ రష్మికకు మాత్రం అన్ని ఇండస్ట్రీలలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా అన్ని భాషల్లో బడా ప్రాజెక్టుల్లో నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతూనే ఉంది.
అయితే ఆమె సినిమాలకు తగ్గట్లే రష్మికకు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టా గ్రామ్ లో 38.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే రష్మిక ఇన్ స్టాలో ఎక్కవుగా యాడ్ పోస్టులు చేస్తూ ఉంటుంది. ప్రముఖ బ్రాండ్ కంపెనీలకు ఆమె ప్రమోషన్లు చేస్తూ వస్తోంది.
ఇలా ఆయా సంస్థలకు సంబంధించిన ప్రమోషన్ పోస్టులకు రష్మిక భారీగా వసూలు చేస్తోందంట. ఒక్కో పోస్టుకు రూ.75లక్షల దాకా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంత మొత్తంలో తీసుకుంటున్న సౌత్ హీరోయిన్ ఆమె మాత్రమే. పైగా సౌత్ హీరోయిన్లలో అందరికంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కూడా కేవలం రష్మికకు మాత్రమే.
చూస్తుంటే రష్మిక ఫాలోయింగ్ మరింత పెరిగే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఆమె మరింత సంపాదించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి రష్మిక ఇంకా ఎంత సంపాదిస్తుందో.
Read Also : Sri Reddy : పవన్ తల్లిని తిట్టమని చెప్పింది వాడే.. శ్రీరెడ్డి ఆరోపణలు..!
Read Also: Jr NTR : ఎన్టీఆర్ కు ఆ అమ్మాయితో సీక్రెట్ ఎఫైర్.. ప్రముఖ క్రిటిక్ సంచలన పోస్టు..!