Rashmika Mandanna : రష్మిక మందన్నా ఇప్పుడు నేషనల్ క్రష్ గా దూసుకుపోతోంది. ఆమె చేస్తున్న సినిమాలు అన్నీ బడా ప్రాజెక్టులే. ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. దాంతో బాలీవుడ్ లో కూడా వరుసగా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆమె గతంలో ఓ షోలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసార వైరల్ అవుతున్నాయి.
గతంలో ఉపాసన యువర్ లైఫ్ పేరుతో ఓ వెబ్ సైట్ ను, మ్యాగజైన్ ను ప్రారంభించింది. హీరోయిన్లను పిలిచి వారి వ్యక్తిగత విషయాలను, వారి తిండికి సంబంధించి విషయాలను అడిగి తెలుసుకుంటుంది. అప్పట్లో రష్మిక కూడా ఈ షోకు గెస్ట్ గా వెళ్లింది. ఇందులో మీ ఇష్టమైన వంటకం ఏంటి అని ఉపాసన అడిగింది.
మేం కోర్గి సామాజికవర్గానికి చెందిన వాళ్లం. మాకు పంది మాంసం అనేది సంప్రదాయక వంటకం. అది చాలా టేస్టీగా ఉంటుంది. కోర్గి వర్గానికి చెందిన ప్రజలు ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటారు. మేం రోజూ పడుకునే ముందే రాత్రి రెండు పెగ్గుల వైన్ తాగుతాం అంటూ సంచలన కామెంట్లు చేసింది రష్మిక.
ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రష్మిక ఇలాంటి కామెంట్లు చేస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదేమో. కానీ రష్మిక చేసిన కామెంట్లు ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతున్నాయి. రష్మిక ప్రస్తుతం యానిమల్ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు పుష్ప-2 షూటింగ్ లో ఊడా బిజీగా ఉంది.
Also Read : Madhavi Latha : ప్రభాస్ కు తెలివి లేదా.. హీరోయిన్ మాధవీలత సంచలన కామెంట్లు..!
Also Read : Actress Anjali : ఏంటీ.. డబ్బుల కోసం ఆ డైరెక్టర్ తో హీరోయిన్ అంజలి ఎఫైర్ పెట్టుకుందా..?