Ravi Teja : రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన ఆయన.. తన నటనతో హీరోగా మారి అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా నిలబడ్డాడు. చిరంజీవి తర్వాత ఎవరి అండ లేకుండా ఎదిగిన స్టార్ హీరో మాత్రం రవితేజ అనే చెప్పుకోవాలి. అలాంటి రవితేజ ఒకానొక సమయంలో హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.
ఇక కచ్చితంగా హిట్ వస్తే తప్ప ఆయనకు హీరోగా అవకాశాలు రావేమో అనే పరిస్థితులు వచ్చాయి. ఆయన హీరోగా చేస్తున్న సమయంలో వరుసగా ప్లాపులు వచ్చాయి. అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. ఇక రవితేజను హీరోగా చూడటం కష్టమే అనుకున్నారు అంతా కూడా. అలాంటి సమయంలోనే వచ్చాడు పూరీ జగన్నాథ్.
వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. కచ్చితంగా హిట్ కొడితే గానీ రవితేజ కెరీర్ నిలబడదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి రవితేజను నిలబెట్టాడు పూరీ జగన్నాథ్. ఇదే విషయాన్ని ఎన్నో సార్లు చెప్పాడు రవితేజ. తన కెరీర్ ను నిలబెట్టింది పూరీనే అని.
Ravi Teja Career Was Supported By Director Puri Jagannadh
ఇక హీరోగా రవితేజను పూరీ నిలబెడితే.. ఆయన్ను స్టార్ హీరోను చేసింది మాత్రం రాజమౌళి. విక్రమార్కుడు సినిమాతో రవితేజ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఈ సినిమా తర్వాత రవితేజ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
Read Also : Sri Reddy : ఏంటీ.. శ్రీరెడ్డికి ఇంత పెద్ద కూతురు ఉందా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!
Read Also : Actor Subbaraju : అల్లు అర్జున్ ను చితక్కొట్టాలని ఉంది.. సుబ్బరాజు షాకింగ్ కామెంట్లు..!