• Telugu News
  • movies

SS Rajamouli : రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి పేరు తెచ్చుకున్న హీరో ఎవరో తెలుసా..?

SS Rajamouli : కేవలం రాజమౌళిని చూసే సినిమాకు మార్కెట్ పెరుగుతుంది. అయితే ఓ హీరో మాత్రం ఏకంగా రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి అది హీరో సినిమా అని నిరూపించాడు..

By: jyothi

Updated On - Sun - 28 May 23

SS Rajamouli : రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి పేరు తెచ్చుకున్న హీరో ఎవరో తెలుసా..?

ప్రస్తుతం రాజమౌళి క్రేజ్ ఎలా ఉందో సినీ ప్రపంచమే చెబుతోంది. ఆయన సినిమా తీశారంటే ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలవ్వాల్సిందే. ఆ సినిమాలో చేసిన హీరో పాన్ ఇండియా స్టార్ అవ్వాల్సిందే. రాజమౌళి సినిమాలకు హీరో ఎవరనేది అస్సలు చూడరు. ఎందుకంటే అక్కడ డైరెక్ట్ చేస్తోంది దర్శక ధీరుడు రాజమౌళి.

అందుకే ఇక్కడ మాత్రం కేవలం రాజమౌళిని చూసే సినిమాకు మార్కెట్ పెరుగుతుంది. అయితే ఓ హీరో మాత్రం ఏకంగా రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసి అది హీరో సినిమా అని నిరూపించాడు. అది కూడా రాజమౌళి డైరెక్ట్ చేసిన సినిమా. అది ఏదో కాదండోయ్ విక్రమార్కుడు.

రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో రవితేజ డబుల్ రోల్ పోషించాడు. కాగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి పేరు కాకుండా రవితేజ పేరు మాత్రమే వినిపించింది. రవితేజ తన నటనతో రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేశారంటూ అప్పట్లో స్టోరీలు రాశారు క్రిటిక్స్.

Ravi Teja Dominated SS Rajamouli Direction With His Performance In Vikramarkudu

Ravi Teja Dominated SS Rajamouli Direction With His Performance In Vikramarkudu

అప్పటి వరకు రాజమౌళి సినిమాల్లో హీరోలకన్నా ఆయనకే ఎక్కువ పేరు వచ్చింది. కానీ తొలిసారి రవితేజ పేరు మార్మోగిపోయింది. కాగా ఆ సినిమాతోనే రవితేజ స్టార్ హీరోగా మారిపోయాడు. అంతకు ముందు ఆయన పెద్ద హీరోగా ఉన్నారు కానీ స్టార్ హీరో కాలేకపోయారు. విక్రమార్కుడు సినిమాతోనే ఆయన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు.

 

Read Also : Atharintiki Daaredi Movie : అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..?

Read Also : Rana Daggubati : హీరో రానా ఆస్తులు ఎంతో తెలుసా.. టాలీవుడ్ లోనే టాప్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News