Viral News : చీకటి అంటేనే అందరికీ భయం వేస్తుంది. మన దేశంలో దెయ్యాలు, భూతాలు అనే నమ్మకాలు చాలా ఎక్కువ. అందుకే అర్ధరాత్రి సమయంలో ఎవరూ పెద్దగా బయటకు రారు. ఎందుకంటే ఆ సమయంలో దెయ్యాలు తిరుగుతాయనేది వారి నమ్మకం. చాలాసార్లు ఈ దెయ్యాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
ఏదో పొగ రూపంలో తిరుగుతుంది అన్నట్టు వీడియోలు ప్రచారం కావడం కూడా మనం గతంలో చాలాసార్లు చూశాం. అయితే ఇప్పుడు ఓ యువతి రోడ్లపై నగ్నంగా తిరగడం కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటన ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. అది యూపీలోని రాంపూర్ పరిధిలోని మిలాక్ ప్రాంతం.
అక్కడ రాత్రి అయిందంటే చాలు రోడ్లపై ఏవేవో శబ్దాలు. అంతే కాదు తలుపులు ఎవరో బాదుతున్నట్టు శబ్దాలు కూడా వస్తున్నాయి. దాంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక తాజాగా అక్కడ స్థానిక కౌన్సిలర్ ఇంటి ముందు ఓ యువతి నగ్నంగా తిరుగుతూ తలుపులు కొడుతున్నట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.
దాంతో ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆ యువతి అలా ఎందుకు తిరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ధైర్యం చేసి ఆ యువతికి ఎదురు పడుదామా అంటే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కొందరేమో అసలు ఆమె మనిషేనా దెయ్యమా అన్నట్టు భయపడుతున్నారు.
यूपी के रामपुर में निर्वस्त्र महिला से दहशत ! आधी रात में खटखटाती है घर के दरवाजे, CCTV वीडियो हुआ वायरल#Rampur #CCTV #ViralVideo pic.twitter.com/UN16rpf2Rk
— India TV Hindi (@IndiaTVHindi) February 2, 2023
Read Also : K Viswanath : షూటింగ్ టైమ్ లో కే విశ్వనాథ్ ఖాకీ బట్టలు ఎందుకు వేసుకుంటాడో తెలుసా..?
Read Also : K Viswanath : కళాతపస్వి విశ్వనాథ్ కు ఈ తరం హీరోల్లో ఎవరు ఇష్టమో తెలుసా..?