Regina Cassandra Wants Be Porn Star : సినిమాల్లో హీరోయిన్ గా చేయాలని చాలామంది అమ్మాయిలు కలలు కంటారు. అది ఎంతోమందికి ఓ పెద్ద సవాల్. కేవలం కొంత మందికి మాత్రమే సాధ్యం అయ్యే పని అది. కానీ పోర్న్ స్టార్ అవ్వాలని మాత్రం ఎవరూ పెద్దగా కోరుకోరు. సమాజంలో గుర్తింపు ఉండదు కాబట్టి దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయరు.
కానీ హీరోయిన్ రెజీనా మాత్రం తాను పోర్న్ స్టార్ అవ్వాలని అనుకున్నట్టు చెబుతోంది. ప్రస్తుతం తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె మళ్లీ తమిళ ఇండస్ట్రీలోనే అవకాశాలు వెతుక్కుంటోంది. ఇదిలా ఉండగా రీసెంట్ గా అక్కడ ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
ఇందులో సంచలన విషయాలు చెప్పింది. సినిమాల్లో బోల్డ్ సీన్లు చేయడంపై రెజీనాకు ప్రశ్న ఎదురైంది. ఆమె స్పందిస్తూ.. నేను గ్లామర్ హీరోయిన్ గా కనిపించడానికి ఇబ్బంది పడను. నాకు అలా చేయడం నచ్చుతుంది. అంతే కాదు బోల్డ్ సీన్లు, రొమాంటిక్ సీన్లు చేయాలని ఉంది. నేను నా చిన్న వయసులో సినిమా స్టార్ కు పోర్న్ స్టార్ కు పెద్దగా తేడా తెలియదు.
అప్పుడు కొందరి మాటలు విని నేను కూడా పోర్న్ స్టార్ అవ్వాలని అనుకున్నాను. కానీ తర్వాత నాకు పోర్న్ స్టార్ అంటే ఏంటో తెలిసి షాక్ అయ్యాను. అందుకే సినిమాల్లోకి వచ్చాను. ఇక్కడ బోల్డ్ సీన్లు చేయడం అనేది కేవలం కథలో భాగమే. అందుకే దాన్ని నేను ఎంజాయ్ చేస్తుంటాను అంటూ తెలిపింది ఈ భామ.