Rekha Boj Reacts On Casting Couch : ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారికి హీరోయిన్ గా అంత ఈజీగా ఛాన్సులు ఇవ్వరు. వారికి కూడా ఎన్నో ఇబ్బందులు తప్పువు. అంతెందుకు ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న చాలా మంది ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ బాధలను ఎదుర్కున్న వారే. అయితే మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది దీనిపై నోరు విప్పుతున్నారు.
మన టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని నిజం చేస్తూ కొందరు హీరోయిన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు రేఖా బోజ్. ఆమె తెలుగులో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది.
కానీ ఇప్పుడు ఆమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. తెలుగు అమ్మాయి అయినా ఆమెకు స్టార్ హీరోయిన్ల అందం ఉంది. కానీ తనుకు ఎందుకు ఛాన్సులు రాలేదో తెలిపింది. నేను ఛాన్సుల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగాను. అప్పట్లో నన్ను చూసి కొందరు అప్సరసలా ఉన్నావ్ అంటూ కామెంట్లు చేశారు. కానీ ఒక్కరు కూడా ఛాన్సులు ఇవ్వలేదు.
కొందరేమో నువ్వు కమిట్ మెంట్ ఇచ్చినా సరే నీకు ఛాన్సులు ఇవ్వం అంటూ తెలిపారు. నువ్వు హీరోయిన్ గా పనికి రావు.. సైడ్ క్యారెక్టర్లు చేసుకో అంటూ అవమానించారు అని చెప్పుకొచ్చింది రేఖా బోజ్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Read Also : Deepika Padukone Love Affair News Viral : దీపికా పదుకొణె ఇంత మందితో ఎఫైర్ పెట్టుకుందా.. మామూల్ది కాదురోయ్..!
Read Also : Taapsee Pannu Love Affairs News Viral : వామ్మో.. తాప్సీ ఇంత మందితో ఎఫైర్ నడిపిందా.. అతనితో కూడా..!