Renu Desai Unknown Story : రేణూ దేశాయ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ బాగా తెలుసు. ఆమె హీరోయిన్ గా కంటే కూడా పవన్ కల్యాణ్ రెండో భార్యగానే ఎక్కువగా ఫేమస్ అయింది. వీరిద్దరూ ఇప్పుడు విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న రేణూ ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది.
అయితే ఆమెకు సంబంధించిన ఓ మ్యాటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ ది గుజరాతీ ఫ్యామిలీ. వీరి కుటుంబంలో ఆడవారి కంటే మగపిల్లలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. తాను మోడలింగ్ నేర్చుకుంటానని రేణూ దేశాయ్ చెప్పినప్పుడు ఇంట్లో వారు అస్సలు ఒప్పుకోలేదు.
దాంతో ఎలాగైనా మోడల్ అవ్వాలనే లక్ష్యంతో ఓ రోజు రాత్రి ఆమె ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ముంబైలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మోడలింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత తెలుగులోకి బద్రిసినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సమయంలోనే పవన్ తో ఆమె ప్రేమలో పడటం.. డేటింగ్ చేయడం మొదలైంది.
ఇద్దరూ పెళ్లికి ముందే అకీరా నందన్ కు జన్మనిచ్చారు. ఆ తర్వాత పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్ ను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. అప్పటి నుంచి రేణూ దేశాయ్ పిల్లలతో కలిసి ఉంటుంది. ఇన్నేండ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రవితేజ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇస్తోంది.