RK Roja Responded On Casting Couch : ఇప్పుడు రోజా రాజకీయాల్లో చాలా బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం వైపీపీ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే రోజా రాజకీయాల కంటే ముందు సినిమాల్లో కూడా నటించారు. ఆమె ఎక్కడ ఉన్నా సరే తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమాల్లో కూడా ఆమె ఫైర్ బ్రాండ్ గానే ముద్ర వేయించుకున్నారు.
కాగా రోజా ఎప్పటికప్పుడు ఏ విషయం మీద అయినా సరే స్పందిస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ఉండే కాస్టింగ్ కౌచ్ మీద ఇప్పుడు ఎవరు ఎలా స్పందిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో శ్రీరెడ్డి అర్థనగ్నంగా చేసిన ధర్నా వల్ల చాలామంది దీనిపై మాట్లాడటం స్టార్ట్ చేశారు. అయితే కొందరు హీరోయిన్లు చేసే ఆరోపణలను కూడా తప్పుబట్టారు.
ఇక గతంలో రోజా కూడా ఈ కాస్టింగ్ కౌచ్ మీద స్పందించింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆమె కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయో లేదో నాకు తెలియదు. నాకు అయితే ఎదురు కాలేదు. కొందరు హీరోయిన్లు ఇప్పుడు ఛాన్సుల కోసం లొంగిపోతున్నారు.
వారే కమిట్ మెంట్లు ఇస్తారు. మళ్లీ వారే ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్. హీరోయిన్లు నిజాయితీగా ఉండి ఆరోపణలు చేస్తే పర్వాలేదు. ఇక్కడ ఎవరూ బలవంతం చేయరు కదా. ఇష్టపూర్వకంగా వెళ్లినప్పుడు మళ్లీ అరవడం ఎందుకు అని రోజా సంచలన కామెంట్లు చేసింది.