Sai Dharam Tej : మెగా హీరోలు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రీసెంట్ గానే వరుణ్ తేజ్ తను ప్రేమించిన లావణ్య త్రిపాఠితో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నాడు. మరికొన్ని నెలల్లో ఆయన పెళ్లి ఉండబోతోంది. దాంతో ఇప్పుడు అందరి చూపు మెగా హీరో సాయిధరమ్ తేజ్ మీద పడింది. ఆయన వయసు ఇప్పుడు 36 ఏళ్లు.
కానీ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయాడు. త్వరలోనే ఆయన పెళ్లి ఉంటుందని అంటున్నారు. ఆయన గతంలో కొందరితో ప్రేమయాణాలు నడిపించాడు. ఆ విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నేను ఇప్పటికే ముగ్గురితో డేటింగ్ చేశాను. డిగ్రీ చదువుకునే సమయంలో ఓ అమ్మాయితే ప్రేమలో పడ్డాను.
కానీ ఆమెకు నేనే దగ్గరుండి మరీ పెళ్లి చేశాను. అప్పుడు నా దగ్గర డిగ్రీ తప్ప ఇంకేం లేదు. అందుకే ఆమెను పోషించలేనేమో అనే భయంతో వేరే వ్యక్తితో పెళ్లి చేశాను. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చే ముందు మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాను. కానీ ఆమె చివరకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయింది.
తిక్క సినిమా చేసే సమయంలో ఆ మూవీలో హీరోయిన్ లారిసా బోనేసి చూడగానే నచ్చేసింది. డేటింగ్ చేద్దామని అడిగితే ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. దాంతో చాలా నిరాశ పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు సాయిధరమ్ తేజ్. వీరితోనే కాకుండా అప్పట్లో రెజీనాతో కూడా లవ్ లో ఉన్నాడని వార్తలు వచ్చాయి. కానీ వాటిపై సాయి స్పందించలేదు.
Read Also : Surekha Vani : అది పెద్దగా ఉన్న వాడు బాయ్ ఫ్రెండ్ గా కావాలి.. సురేఖ వాణి ఏంటీ కామెంట్లు..!
Read Also : Lakshmi Rai : తెలుగు హీరోలు కూడా కోరిక తీర్చమన్నారు.. లక్ష్మీరాయ్ సంచలన ఆరోపణలు..!