Sai Pallavi : సాయిపల్లవి ఎంత మొండిదో అందరికీ తెలిసిందే. తనకు తన పాత్ర నచ్చితేనే ఆ సినిమాను యాక్సెప్ట్ చేస్తుంది. అంతే తప్ప తన పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేసేస్తుంది. అది ఆమెకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఈ కారణంగానే ఆమె స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
అలా అని ఆమెకు ఛాన్సులు రాలేదా అంటే వచ్చాయి. కానీ తానే రిజెక్ట్ చేసింది. అలా ఆమె రిజెక్ట్ చేసిన సినిమాల్లో డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించారు. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వాస్తవంగా ముందు సాయిపల్లవిని హీరోయిన్ గా అడిగారంట.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథకు సాయిపల్లవి కరెక్ట్ గా సరిపోతుందని ఆమెకు కథ చెప్పాడంట భరత్. అయితే సాయిపల్లవికి తన పాత్ర బాగా నచ్చినా.. విజయ్ తో లిప్ లాక్ చేయాలని చెప్పడంతో వెంటనే నో చెప్పేసిందంట. తనకు లిప్ లాక్ లు అంటే ఇబ్బందికరంగా ఉంటుందని, కాబట్టి తాను చేయనని ముఖం మీదనే చెప్పేసిందంట.
Sai Pallavi Rejected Movie Dear Comrade
ఆమె వద్దని చెప్పడంతో రష్మికను ఇందులోకి తీసుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాలేదు కానీ.. యూత్ ను బాగానే ఆకట్టుకుంది. సాయిపల్లవి ఈ విషయాలను స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు సాయిపల్లవి ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించలేదు.
Read Also : Anjali : అవును.. ముంబై హీరోయిన్లు కమిట్ మెంట్లు ఇస్తారు.. అంజలి షాకింగ్ కామెంట్లు..!
Read Also : Ram Gopal Varma : రాజమౌళి, సుకుమార్ వేస్ట్.. బ్యాక్ గ్రౌండ్ లేని వారితో సినిమా చేయరుః ఆర్జీవీ