Sai Pallavi : సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన అవకాశం వస్తే చేయాలని ఎంతో మంది హీరోయిన్లు కలలు కంటారు. ఎందుకంటే ఆయన సరసన చేస్తే పెద్ద హీరోయిన్ల లిస్టులో చేరిపోతామని భావిస్తారు. ఎందుకంటే మహేశ్ బాబుకు ఉన్న మార్కెట్ అలాంటిది. మరి అంత పెద్ద స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా..
కానీ సాయిపల్లవి మాత్రం వదులుకుంది. అవును మహేశ్ బాబు పక్కన హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చినా వదులుకుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సాయిపల్లవి మొదటి నుంచి డిఫరెంట్. తనకు తన పాత్ర నచ్చితేనే ఆ సినిమా చేస్తుంది.
ఆ సినిమాలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటేనే చేస్తుంది. లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే రిజెక్ట్ చేస్తుంది. మహేశ్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన మూవీ సరిలేరు నీకెవ్వరు. ఈ మూవీలో ముందుగా సాయిపల్లవిని అడిగారంట. కానీ పాత్రకు పెద్దగా స్కోప్ లేదనే కారణంతో రిజెక్ట్ చేసింది సాయిపల్లవి.
Sai Pallavi Rejected Movie Sarileru Neekevvaru
దాంతో చేసేది లేక రష్మికను తీసుకున్నారు. ఈ మూవీ మంచి హిట్ అయింది. కానీ రష్మికకు పెద్దగా పేరు రాలేదు. క్రెడిట్ మొత్తం మహేశ్ బాబుకే వెళ్లిపోయింది. ఇదే విషయాన్ని సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించింది. తనకు పాత్ర నచ్చితేనే చేస్తానని, లేకపోతే చేయలేనని తెలిపింది.
Read Also : Mahesh Babu : అందరికంటే ఆ హీరోయిన్ అందంగా ఉంటుంది.. మహేశ్ బాబు కామెంట్లు..!
Read Also : Tollywood : టాలీవుడ్ లో అత్యధిక అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న హీరో అతనే..!