Samantha Post Viral On Social Media : సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్నప్పటి నుంచే ఈ విధంగా ఆమె మీడియాలో హైలెట్ అవుతూ వస్తోంది. మొన్నటి వరకు మయో సైటిస్ వ్యాధితో బాధపడ్డ ఆమె.. ఇప్పుడు ఆ వ్యాధి నుంచి కోలుకుంది.
మళ్లీ వరుసగా సినిమా షూటింగుల్లో పాల్గొంటుంది ఈ భామ. ఇప్పుడు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో చేస్తోంది. దాంతో పాటు వరుణ్ ధావన్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ భామ. ఇదిలా ఉండగా తాజాగా సమంత ఇన్ స్టాలో ఓ షాకింగ్ పోస్టు పెట్టింది. ఇందులో ఏముందో ఇప్పుడు చూద్దాం.
మీకు ఎవరైతే మంచి వ్యక్తిగా అనిపిస్తారో.. అలాంటి వ్యక్తిని 100 సార్లు మల్టీప్లై చేస్తే ఇలాంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్. నువ్వు ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ వే మై డియర్. నేను జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ షాకింగ్ పోస్టు పెట్టింది.
Samantha Praises Rahul Ravindran
ఇంకేముంది ఆమెను ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. నువ్వు చైతూను తప్ప అందర్నీ ప్రేమిస్తావ్.. అందుకే నీకు విడాకులు ఇచ్చాడు అంటూ కొందరు వల్గర్ గా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. పెళ్లి అయిన హీరోపై మోజు పడకు అంటూ సెటైర్లు వేస్తున్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్ చిన్మయికి అన్యాయం చేయకు అంటూ ఆడేసుకుంటున్నారు.