Samantha : సమాజంలో పురుషుల ఆధిపత్యమే నడుస్తోందనేది కాదనలేని వాస్తవం. ఇదే విషయం సినిమాల్లో కూడా నడుస్తోంది. సినిమాల్లో హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ హీరోయిన్లకు ఉండదు. హీరోలను ఆధారంగా చేసుకునే సినిమాలు వస్తాయి. హీరోలకే రెమ్యునరేషన్ ఎక్కువ. ఈ వివక్షపై గతంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు.
తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా స్పందించింది. ఆమె గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే సౌత్ లోనే అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా చాలానే నటించింది. అయితే మొదటిసారి ఆమె సినిమా ఛాన్సుల గురించి మాట్లాడింది.
సినిమాల్లో హీరోలను బేస్ చేసుకునే కథలు వస్తాయి. వాటికే ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది. కాబట్టి నిర్మాతలు, డైరెక్టర్లు కూడా దాన్నే ఫాలో అవుతారు. అందులో తప్పులేదు. హీరోలను మేము నమ్ముకుంటేనే మాకు ఛాన్సులు వస్తాయి. అంతే తప్ప మాకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ కావాలంటే కుదరదు.
హీరోల పాత్రలకు తగ్గట్టే మా పాత్రలను డిజైన్ చేస్తారు. అందుకే మాకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. మా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కానీ నటన పరంగా మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అంటూ సమంత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Jeevitha Rajasekhar : రూమ్ కు రమ్మని ఇబ్బంది పెట్టాడు.. జీవిత రాజశేఖర్ సంచలన ఆరోపణలు..!
Read Also : Karthi : హీరో సూర్యకు పొగరెక్కువ.. నన్ను దూరం పెట్టేవాడు.. కార్తీ సంచలనం..!