Samantha : టాలీవుడ్ లో సమంత, చైతూ జంటకు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు. అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత ఫ్యాన్స్ రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు సమంతకు సపోర్టు చేస్తుంటే.. అక్కినేని ఫ్యాన్స్ మాత్రం చైతూకు అండగా నిలుస్తున్నారు. విడాకుల తర్వాత సమంత, చైతూ స్పందించే విధానం వేరుగా ఉంటుంది.
చైతూ ఎవరి మనసు నొప్పించకుండా చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ సమంత మాత్రం నిత్యం ఫైర్ అవుతూనే ఉంది. చైతూ పేరు తీసుకు వచ్చినప్పుడల్లా రుసరుసలాడుతూనే వస్తోంది. అయితే తాజాగా చైతూ నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటున్నాడు.
ఇలా ఆయన ప్రమోషన్లు స్టార్ట్ చేశాడో లేదో.. సమంత తన సోషల్ మీడియాలో టార్చర్ టైమ్ అంటూ పోస్టులు పెడుతోంది. ఇంకేముంది సమంత కావాలనే చైతూను టార్గెట్ చేస్తూ ఇలా టార్చర్ టైమ్ అంటూ పోస్టులు పెడుతోందంటూ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఒక రకంగా ఆమె ఇన్ డైరెక్టుగా చైతూను ఉద్దేశించే ఇలాంటి పోస్టులు పెడుతోందని అంటున్నారు.
ఇక సమంత రీసెంట్ గా నటించిన శాకుంతలం సినిమా అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడానికి చైతూ అభిమానులు, అక్కినేని అభిమానులే కారణమంటూ సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దాంతో ఇప్పుడు సమంత కూడా చైతూ సినిమాను టార్గెట్ చేసిందని అంటున్నారు.
Read Also : Mega Star Chiranjeevi : బలవంతంగా ఆ హీరోయిన్ తో చిరు లిప్ లాక్.. చివరకు భారీ ట్విస్ట్..!
Read Also : Posani Krishna Murali : బోయపాటి శ్రీనుకు పోసాని కృష్ణ మురళి సొంత అన్నయ్య అని మీకు తెలుసా..?