• Telugu News
  • news

Sania Mirza: సానియా మీర్జా భర్తకు.. సర్రున కాలింది..

Sania Mirza: లోకల్ టు గ్లోబల్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, సీనియర్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)పై మండిపడ్డాడు. పీసీబీలో ఉన్నోళ్లు ఆటగాళ్ల మెరిట్ ని బట్టి కాకుండా తమకున్న వ్యక్తిగత పరిచయాలను బట్టి టీమ్ ని, ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదని తప్పుపట్టాడు. కెప్టెన్ ఒపీనియన్ ని పరిగణనలోకి తీసుకొని ప్లేయర్లను ఎంపిక చేస్తేనే సత్ఫలితాలొస్తాయని తేల్చిచెప్పాడు. ఎందుకంటే.. గ్రౌండ్ […].

By: jyothi

Published Date - Mon - 17 May 21

Sania Mirza: సానియా మీర్జా భర్తకు.. సర్రున కాలింది..

Sania Mirza: లోకల్ టు గ్లోబల్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, సీనియర్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ)పై మండిపడ్డాడు. పీసీబీలో ఉన్నోళ్లు ఆటగాళ్ల మెరిట్ ని బట్టి కాకుండా తమకున్న వ్యక్తిగత పరిచయాలను బట్టి టీమ్ ని, ప్లేయర్లను సెలెక్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదని తప్పుపట్టాడు. కెప్టెన్ ఒపీనియన్ ని పరిగణనలోకి తీసుకొని ప్లేయర్లను ఎంపిక చేస్తేనే సత్ఫలితాలొస్తాయని తేల్చిచెప్పాడు. ఎందుకంటే.. గ్రౌండ్ లో ఆడాల్సింది, మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పాల్సింది ఆటగాళ్లే కాబట్టి, వాళ్లకు నాయకత్వం వహించేది కెప్టెనే కాబట్టి అతనికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలని సూచించాడు.

ఆజమ్ అంటే లెక్కలేదు..

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఇటీవల జింబాబ్వేలో పర్యటించింది. టెస్ట్ సిరీస్ ని 2-0 తేడాతో నెగ్గింది. అయినప్పటికీ ఆ పర్యటనకు ముందు జట్టును ఎంపిక చేసే విషయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ సలహాలను, సూచనలను పీసీబీ లెక్కలోకి తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై షోయెబ్ మాలిక్ తాజాగా స్పందించాడు. ‘‘సెలెక్టర్లు తమకు నచ్చినోళ్లు, నచ్చనోళ్లు అనే ప్రాతిపదిక ప్లేయర్లను ఎంపిక చేస్తుంటారు. మంచికో చెడుకో ఈ పద్ధతి ప్రపంచం మొత్తమ్మీద క్రికెట్ వ్యవస్థలో ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఇది పాకిస్థాన్ కల్చర్ లో ఇంకొంచెం ఎక్కువగా ఉండటం బ్యాడ్ లక్. స్కిల్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఎవరైతే తమకు బాగా తెలుసో వాళ్లకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇట్లయితే కష్టం. పాకిస్థాన్ క్రికెట్ బాగుపడదు’’ అని షోయెబ్ మాలిక్.. పాక్ ప్యాషన్ డాట్ నెట్ అనే వెబ్ సైట్ వాళ్లతో మాట్లాడుతూ తేల్చిచెప్పాడు.

నాకు ఆ బాధలేదు..

షోయెబ్ మాలిక్ తన చివరి టీ20 మ్యాచ్ ని 2020 సెప్టెంబర్ లో ఇంగ్లండ్ తో ఆడాడు. చివరి వన్డేని ఇండియాతో 2019 జూన్ లో ఆడేశాడు. అంటే దాదాపు రెండేళ్లుగా వన్డే టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తనను మళ్లీ సెలెక్ట్ చేయకపోవటం పట్ల తనకు బాధగా లేదని, తన సహచర క్రికెటర్ల తరఫున కూడా మాట్లాడే అవకాశం లేకపోతే అప్పుడు ఫీలవుతానని చెప్పాడు. తన భవిష్యత్తు దేవుడి చేతుల్లో తప్ప ఎవరి చేతుల్లోనూ లేదని షోయెబ్ మాలిక్ అన్నాడు.

 

Related News