Senior Actress Pavala Shyamala : పావలా శ్యామల చాలా తెలుగు సినిమాల్లో నటించింది. ఖడ్గం, ఆంధ్రావాలా లాంటి సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకు వచ్చాయి. అయితే వృద్దాప్యం కారణంగా ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా నటించట్లేదు. ఇంటి వద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు జరిగిన అనుభవాన్ని పంచుకుంది.
నేను వృద్దాప్యంలో ఉన్నప్పుడు నాకు పెద్దగా ఛాన్సులు రాలేదు. దాంతో ఎవరో చెబితే నేను ఛాన్సుల కోసం పవన్ కల్యాణ్ ఆఫీసుకు వెళ్లాను. కానీ పవన్ మేనేజర్ నన్ను లోపలకు వెళ్లనీయలేదు. ఆయన ఇప్పుడు కోపంలో ఉన్నారు వద్దు అని చెప్పారు. కానీ ఎలాగైనా పవన్ ను కలవాలనే ఉద్దేశంతో అక్కడే నా కూతురుతో చలిలో నిలబడ్డాను.
పవన్ కల్యాణ్ బయటకు వచ్చారు. ఆయన్ను కలవాలని వెళ్తుంటే పక్కనే ఉన్న బండ్ల గణేశ్ నన్ను తోసేశారు. ఆయన ఇప్పుడు కోపంలో ఉన్నారు వద్దు అని చెప్పారు. అంతలోనే పవన్ కల్యాణ్ జీపులో ఎక్కి వెళ్తున్నారు. కానీ సడెన్ గా నన్ను చూసి వెంటనే జీపులో నుంచి దూకి నా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అని అడిగారు.
నాకు ఛాన్సులు ఇవ్వండని అడిగాను. వెంటనే ఆయన మేనేజర్ ను పిలిచి ఈమెకు రూ.20వేలు ఇవ్వండి. రేపు రూ.80వేలు ఇవ్వండి అని చెప్పారు. అలా మొత్తం నాకు రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు పవన్ కల్యాణ్. నిజంగా ఆయన చాలా గొప్పవాడు. ఆయన విడాకుల బాధలో ఉండి కూడా నాకు సాయం చేశారు అంటూ చెప్పుకొచ్చింది పావలా శ్యామల.
Read Also : Sai Pallavi : సాయిపల్లవితో లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
Read Also : Karate Kalyani : నేను పైట జారిస్తే సొల్లు కారుస్తారు.. కరాటే కల్యాణి కామెంట్లు వైరల్..!