Shruti Haasan : కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ హీరోయిన్ గా కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయింది. వాస్తవానికి ఆమెకు ఉన్న ట్యాలెంట్ కు సౌత్ లోనే ఉంటే ఇంకొన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా రాణించేది. కానీ ఆమె ఆ అవకాశాలను వినియోగించుకోలేక బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణించాలని ఆశ పడుతోంది.
కానీ అక్కడ కూడా ఎక్కువగా అవకాశాలు రావట్లేదు. దాంతో సౌత్ లో సీనియర్ హీరోల సరసన ఛాన్సులు వచ్చినా చేస్తోంది. ఇదిలా ఉండగా ఆమె మీద చాలానే లవ్ ఎఫైర్ రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటిపై ఎన్నడూ స్పందించలేదు. కానీ ఓ సారి మాత్రం వాటిపై సీరియస్ గా రియాక్ట్ అయింది ఈ బ్యూటీ.
ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఈ ప్రశ్న ఎదురు కాగా ఆమె స్పందించింది. నేను గతంలో చాలా మందితో రిలేషన్ లో ఉన్నాను. అది నిజమే. కానీ నాకు లవ్ కంటే కూడా పనిమీదనే శ్రద్ద ఎక్కువ. అది అవతలి వారికి నచ్చేది కాదు. అందుకే వారి నుంచి దూరంగా ఉన్నాను. మనం చేస్తున్న పనిని గౌరవించే వారితోనే మనం ప్రేమలో ఉండాలని నాకు అర్థం అయింది.
అలాంటి వారినే మన జీవిత భాగస్వామిగా చేసుకోవాలి. లేకపోతే మనం లైఫ్ లో చాలా కోల్పోతాం అంటూ తెలిపింది శృతి. ఇక చాలామందితో లవ్ ఎఫైర్ మెయింటేన్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు శాంతాను హజారికతో డేటింగ్ లో ఉంది. వీరిద్దరూ ముంబైలో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
Also Read : Ravi Teja : పడిపోతున్న రవితేజ కెరీర్ ను నిలబెట్టిన డైరెక్టర్ ఆయనే.. రాజమౌళి కాదు..!
Also Read : Heroine : అతనితో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్న హీరోయిన్.. ఇన్నాళ్లకు బయట పడింది..!