Shruti Haasan Talks About Her First Love : గ్లామర్ బ్యూటీ శృతిహాసన్ ఇప్పుడు ఎక్కువగా ముంబైలోనే ఉంటుంది. మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఈ భామ.. ఇప్పుడు ముంబైకి మకాం మార్చింది. ప్రస్తుతం అక్కడే ఉంటూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక రకంగా ఆమెకు ఇప్పుడు తెలుగులో యంగ్ హీరోలు సినిమా ఛాన్సులు ఇవ్వట్లేదు.
అందుకే సీనియర్ హీరోల సరసన సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆమె శాంతాను హజారికతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబైలో ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ విషయాలను పంచుకుంది శృతి. తన ప్రియుడు శాంతాను ఎంతో అండర్ స్టాండింగ్ గా ఉంటాడని చెప్పింది. తాను చేసే ప్రతి పనిలో అతని సపోర్టు ఉంటుందని వివరించింది. వాస్తవానికి తాను ఏడో తరగతిలోనే ఓ అబ్బాయితో ఫస్ట్ లవ్ లో పడ్డానని చెప్పింది.
అప్పుడు అంత మెచ్యూరిటీ లేదని కొన్నాళ్లకే ఆ అబ్బాయికి దూరం అయినట్టు చెప్పింది.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డట్టు తెలిపింది. ఇప్పటికే కొన్ని బ్రేకప్ లు అయ్యాయని.. అందుకే ఇప్పుడు స్ట్రాంగ్ రిలేషన్ ను ఎంచుకున్నట్టు వివరించింది. శాంతాను హజారికతో తన రిలేషన్ ముందు ముందు కొనసాగుతుందని స్పష్టం చేసింది ఈ భామ.
Read Also : Renu Desai Unknown Story : ఆ కోరిక తీర్చుకోవడానికి ఇంట్లో నుంచి లేచిపోయిన రేణూ దేశాయ్..!