Shruti Marathe Reacts On Casting Couch : సినిమా ఇండస్ట్రీ అంటేనే కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణ అన్నట్టు మారిపోయింది. గతంలో కూడా ఇది బాగానే ఉండేది. కానీ అప్పట్లో పెద్దగా ఎవరూ బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు మాత్రం అందరూ దాన్ని బటయ పెట్టేస్తున్నారు. దానికి కారణం మీటూ ఉద్యమమే. ఆ సమయం నుంచే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.
స్టార్ హీరోలు, నిర్మాతలు అని కూడా చూడకుండా.. ధైర్యంగా తమకు జరిగిన అనుభవాలను బయటపెడుతున్నారు. ఇక తాజాగా తమిళ నటి శృతి కూడా ఇలాంటి సంచలన కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. నాతో ఓ నిర్మాత తప్పుగా మాట్లాడాడు. అందుకు తగ్గట్టే ఆయనకు ధీటైన సమాధానం చెప్పాను.
తమిళ స్టార్ హీరో సినిమాలో నాకు ఛాన్స్ ఇస్తానంటూ ఓ నిర్మాత నా వద్దకు వచ్చాడు. దాంతో నేను చాలా సంతోషపడ్డాను. మెల్లిమెల్లిగా అతని మనసులో ఉన్నది బయట పెట్టేశాడు. తనతో ఒక రోజు రాత్రి గడపమంటూ చెప్పాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చేసింది. నీతో ఒక రాత్రి పడుకుంటే సరిపోతుందా..
హీరోతో ఎవరు పడుకుంటారు అంటూ బదులిచ్చాను. ఆ నిర్మాత కోరింది చేయకపోతే నన్ను సినిమా నుంచి తీసేశారు. అయినా సరే నేను బాధపడలేదు. అలాంటి పనులు చేసి ఛాన్సులు పొందాలని నేను అనుకోవట్లేదని ముఖం మీదనే చెప్పేశాను. ఇప్పుడు నా ట్యాలెంట్ చూసి నాకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ తెలిపింది శృతి.